Barack Obama Birthday: ఒబామా జేబులో హనుమాన్ ప్రతిమ.. ఆసక్తికర విషయాలు మీకోసం..
Barack Obama Birthday: హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధ దేవుళ్లలో హనుమంతుడు ఒకరు. హనుమంతుడు ధైర్యానికి ప్రతీకగా కొలుస్తుంటాం.
Barack Obama Birthday: హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధ దేవుళ్లలో హనుమంతుడు ఒకరు. హనుమంతుడుని ధైర్యానికి ప్రతీకగా కొలుస్తుంటాం. దైవసంబంధిత పుస్తకాలు, పురాణాలు, కథల్లో ఆయన గురించి ఎన్నో కథనాలు చదివాం. టెలివిజన్ సీరియళ్లు, సినిమాల్లో హనుమంతునిపై ఎన్నో చిత్రీకరణలు చూశాం. జీవితంలో ధైర్యం, బలం పొందడానికి భక్తులు హనుమంతుణ్ణి మనసారా ఆరాధిస్తుంటారు. సాధారణ ప్రజలే కాదు.. గొప్ప గొప్ప సామ్రాజ్యాధి నేతలు సైతం ఆ భగంతుడిని విశ్వసిస్తుంటారు. అంతెందుకు.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా పని చేసి.. యావత్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బరాక్ ఒబామా కూడా హనుమంతుడిని ఆరాధిస్తారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు కూడా. తన జేబులో నిత్యం హనుమంతుని విగ్రహం ఉంటుందని, తానెక్కడికి వెళ్లినా ఆ విగ్రహం తన వెంటే ఉంటుందని చెప్పారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ప్రత్యేక వివరాలను మీకు తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే.. హనుంతుడుని ఒబామా ఏ విధంగా ఆరాధిస్తారో తెలుసుకుందాం. యూట్యూబ్ సృష్టికర్తలు డెస్టిన్ శాండ్లిన్, ఇంగ్రిడ్ నిల్సన్, అడాండే థోర్నే అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూను జనవరి 15, 2016న ది వైట్ హౌస్ అధికారిక యూట్యూబ్ అకౌంట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వ్యక్తిగత ప్రాముఖ్యత కలిగిన వస్తువులను చూపించమని ఒబామాను నిల్సన్ కోరారు. అప్పుడు వెంటనే స్పందించిన ఒబామా.. తన జేబులోంచి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన చిన్న చిన్న వస్తువులను వరుసగా తీయడం ప్రారంభించారు. వీటిలో పోప్ ప్రావిన్స్ ఒబామాకు బహుమతిగా ఇచ్చిన రోసరీ పూసలు సహా.. ఒక చిన్న బుద్ద విగ్రహం, ఒక వెండి పేకాట చిప్, కాప్టిక్ క్రాస్, హనుమంతుని విగ్రహం ఉన్నాయి. అవి చూసి వారు షాక్ అయ్యారు. అయితే, తనకు మూఢనమ్మకాలు లేవని ఒబామా స్పష్టం చేశారు. ‘ఈ చిహ్నాలు ఎల్లప్పుడూ నా వెంటే ఉంటాయి. నేను ఎక్కడికి వెళ్లినా వీటిని నా జేబులోనే తీసుకెళ్తాను. అలా అని మూఢ విశ్వాసాలు కలిగిలేను. నాపై నేను విశ్వాసం కలిగి ఉండాలని భావిస్తుంటాను.’ అని ఒబామా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ‘‘ఎప్పుడైనా నాకు అలసటగా, నిరుత్సాహంగా అనిపిస్తే.. వెంటనే నా జేబులో చేయి పెట్టి ఆ వస్తువులను స్పృశిస్తాను. బలంగా శ్వాస తీసుకుని ప్రతికూల పరిస్థితులను నేను అధిగమించగలను అని నాలో నేను అనుకుంటాను. ప్రతీకూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని నాకు ఎవరో ఇచ్చారని విశ్వసిస్తాను’’ అంటూ ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు మిస్టర్ ఒబామా.
ఇదిలాఉంటే.. ఒబామా తల్లిదండ్రులు ఇద్దరూ ఇండోనేషియాలోనే ఉండేవారు. అలా ఒబామా కూడా చిన్నప్పుడు ఇండోనేషియాలో నివసించారు. అయితే, ఇండోనేషియాలోని ఆరు అధికారిక మతాలలో హిందూ మతం ఒకటి. మొత్తం జనాభాలో 1.7 శాతం మంది హిందూ మతాన్ని, హిందూమత ఆచారాలను పాటిస్తుంటారు.
Obama Interview:
Also read:
Andhra Pradesh: దివిసీమను భయపెడుతున్న విషసర్పాలు.. మూడు రోజుల్లో 21 మందిని కాటేశాయి..
Andhra Pradesh: కీలక వివరాలు లీక్ చేస్తున్నారంటూ ఆ ముగ్గురిపై వేటు.. ఏపీ సర్కార్ సంచలన ఉత్తర్వులు..