Andhra Pradesh: దివిసీమను భయపెడుతున్న విషసర్పాలు.. మూడు రోజుల్లో 21 మందిని కాటేశాయి..

Andhra Pradesh: కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతాన్ని విషసర్పాలు భయపెడుతున్నాయి. బుసలు కొడుతూ హడలెత్తిస్తున్నాయి.

Andhra Pradesh: దివిసీమను భయపెడుతున్న విషసర్పాలు.. మూడు రోజుల్లో 21 మందిని కాటేశాయి..
Venomous Snake 1
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 04, 2021 | 9:51 AM

Andhra Pradesh: కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతాన్ని విషసర్పాలు భయపెడుతున్నాయి. బుసలు కొడుతూ హడలెత్తిస్తున్నాయి. గత మూడు రోజుల వ్యవధిలోనే 21 పాముకాలు కేసులు దివిసీమ ప్రాంతంలో నమోదు అవడం.. అక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది. కాగా, తాజాగా పాముకాటుకు ఓ రైతు బలయ్యాడు. వివరాల్లోకెళితే.. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నంగేగడ్డ గ్రామానికి చెందిన బండ్రెడ్డి చలపతిరావు అనే రైతు మంగళవారం నాడు తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. ఆ సమయంలో అతన్ని పాము కాటేసింది. దాంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాధితుడు చలపతిరావును అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

అయితే, దురదృష్టావశాత్తు మార్గం మధ్యలోనే ప్రాణాలు వదిలాడు చలపతిరావు. కాగా, గడిచిన మూడు రోజుల్లో దాదాపు 21 మంది పాముకాటుకు గురయ్యారు. పామర్రు, మొవ్వ, అవనిగడ్డ ప్రాంతాల్లో పాముకాటు కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. దాంతో ఈ ప్రాంతాల్లో ప్రజలు హడలిపోతున్నారు. పాముల బెడద నుంచి తమను రక్షించాలని, అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా, ఇలాంటి ఘటనలు దివిసీమ ప్రాంతంలో ఇదే తొలిసారి కాదు. ప్రతీ ఏటా ఖరీఫ్ సీజన్‌లో ఎంతో మంది రైతులు పాము కాటుకు బలైపోతున్నారు. కొన్నేళ్లుగా ఆ ప్రాంతంలో రికార్డ్ అయిన పాము కాటు కేసులను పరిశీలిస్తే.. పరిస్థితి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Also read:

Andhra Pradesh: కీలక వివరాలు లీక్ చేస్తున్నారంటూ ఆ ముగ్గురిపై వేటు.. ఏపీ సర్కార్ సంచలన ఉత్తర్వులు..

Andhra Pradesh: ప్రమోషన్ అంటూ పార్టీ ఇస్తాడు.. ఆపై అందినకాడికి దోచుకెళ్తాడు.. వీడి మోసాలు అన్నీఇన్ని కావు..

Cyberabad Traffic Police: బీ అలర్ట్.. ఒక్క ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉన్నా ఇక అంతే సంగతులు..