KRMB: జలజగడం పరిష్కారానికి కదలిన కేఆర్ఎంబీ.. రేపు రాయలసీమలో రివర్‌బోర్డు సభ్యులు పర్యటన

కృష్ణానది జలాల జలజగడంపై రివర్‌బోర్డు సభ్యులు రేపు రాయలసీమలో పర్యటించనున్నారు. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు.

KRMB: జలజగడం పరిష్కారానికి కదలిన కేఆర్ఎంబీ.. రేపు రాయలసీమలో  రివర్‌బోర్డు సభ్యులు పర్యటన
Krmb
Follow us

|

Updated on: Aug 04, 2021 | 10:08 AM

KRMB members visit Rayalaseema: కృష్ణానది జలాల జలజగడంపై రివర్‌బోర్డు సభ్యులు రేపు రాయలసీమలో పర్యటించనున్నారు. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు. బృందంలో తెలంగాణకు చెందినవారు ఎవరూ ఉండకూడదని బోర్డుకు ఏపీ సర్కార్‌ షరతు విధించింది. ఈ మేరకు KRMBకి ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. గతంలో పలుమార్లు సందర్శించాలని భావించినా ఏపీ ప్రభుత్వం సహకరించలేదన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో పలుమార్లు వాయిదా పడుతూ రాగా.. ప్రస్తుతం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలతో.. KRMB బృందం పర్యటించబోతోంది. ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలించి NGT నివేదికను ఇవ్వనుంది.

ఇదిలావుంటే, భారతదేశంలోని పెద్ద నదుల్లో కృష్ణ నాలుగోది. పొడవులో గంగ, బ్రహ్మపుత్ర, గోదావరుల తరువాతి స్థానంలో ఉంటుంది. దాదాపు 1300 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది, మహారాష్ట్ర నుంచి కర్ణాటక, అక్కడి నుంచి తెలంగాణ, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. సుమారు 90 కిలోమీటర్ల దూరం తెలంగాణలో ప్రవహించి, ఆ తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఉంటుంది. కృష్ణా నదికి ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. అలంపురం నుంచి ముక్త్యాల వరకు ఈ నది రెండు రాష్ట్రాలకు సరిహద్దు. ఆ తరువాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల వివాదాలు ఉండేవి. ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ, తెలంగాణ, ఆంధ్ర మధ్య కూడా కృష్ణా నీటి విషయంలో వివాదం ఉంది. అంతేకాదు, ఏపీలో కూడా రాయలసీమ, కోస్తా ప్రాంతం మధ్య కూడా కృష్ణా నీటి విషయంలో వివాదం కొనసాగుతోంది. కృష్ణానదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు తెలంగాణ, ఆంధ్రాలకు ఉమ్మడిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కుడివైపున ఏపీ ఉండగా, ఎడమవైపున తెలంగాణ ఉంది. వీటికి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలో ఉండగా, దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీ ఏపీ భూభాగంలోకి వస్తుంది. ఇవి కాక అనేక లిఫ్టు పథకాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల అవసరాలను ఈ ప్రాజెక్టులు తీరుస్తున్నాయి.

అయితే. రాష్ట్రాల మధ్య నీటి పంపకం కోసం భారత ప్రభుత్వం 1969 ఏప్రిల్‌లో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. నది నీళ్లు రాష్ట్రాల మధ్య పంచడం ఈ ట్రిబ్యునల్ పని. దీనికి ఆర్ఎస్ బచావత్ అధ్యక్షులు కాగా, డిఎం భండారి, డిఎం సేన్ సభ్యులు. దీన్నే బచావత్ ట్రిబ్యునల్ పిలుస్తారు. ఇక, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ పేరుతో పనిచేసిన ఈ బృందం 1976 మేలో తమ తీర్పును అందించింది. వాస్తవానికి 1973లోనే ఈ తీర్పు ఇచ్చినా, దాన్ని భారత ప్రభుత్వం 1976లో ప్రకటించింది. అప్పటికి నది నీటిలో 75శాతం నీటిని లెక్కేసి పంచారు. కాగా, 2014 రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాయి. బేసిన్ల లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ 68శాతం ఉండగా, నీటి వాటా 37 శాతం వచ్చింది. ఇక ఆంధ్రలో కృష్ణా బేసిన్ 32శాతం ఉండగా, నీటి వాటా 64 శాతం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అనుకున్నారు. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. విభజన చట్టం కింద కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. విడిపోయిన తరువాత నీటి పంపకాలు కూడా కొత్తగా చేపట్టాలని తెలంగాణ కోరుతోంది.

ఈ నేపథ్యంలో జల వివాదం పరిష్కరించడంలో భాగంగా రివర్‌బోర్డు సభ్యులు రేపు రాయలసీమలో పర్యటించనున్నారు. ఇప్పటికే కృష్ణారివర్‌బోర్డు సభ్యులు తమ టూర్‌పై ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించారు. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరుకుంటే కానీ సాగునీరు, తాగునీటి అవసరాలకోసం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉండదని ఏపీ గట్టిగా వాదిస్తోంది. చెన్నైకు తాగునీటి సరఫరాతో పాటు రాయలసీమలోని నాలుగు జిల్లాలకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి వెళ్లే నీళ్లే ఆధారమని అంటోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కొత్తది కాదని, తమ వాటా ప్రకారమే వాడుకుంటామని ఏపీ ప్రభుత్వం అంటుండగా.. తెలంగాణ మాత్రం తప్పుపడుతోంది. అది అక్రమ ప్రాజెక్టుగా ఆరోపిస్తోంది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా.. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని అంటోంది. ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ బోర్డు.. ఆ ప్రాంతాన్ని సందర్శించి ఎలాంటి నివేదికను ఇస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

మంగళవారం జరిగిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సంయుక్త సమన్వయ భేటీకి.. తెలంగాణకు చెందిన సభ్యులు గైర్హాజరయ్యారు. గెజిట్‌ ప్రకారం ప్రాజెక్టుల స్వరూపంపై అభ్యంతరాలున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నందున వివరాలు ఇవ్వాలని బోర్డు సభ్యులు కోరగా అందుకు ఏపీ నిరాకరించింది. తెలంగాణ మాత్రం పూర్తిస్థాయి బోర్డు భేటీ జరిపాకే, సమన్వయ కమిటీ భేటీ జరపాలని కోరుతోంది. ఇదే అంశంపై గతంలో గోదావరి యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది. నిన్ననే కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. కృష్ణాబోర్డు పూర్తి స్థాయి సమావేశాన్ని అత్యవసరంగా అయినా ఏర్పాటు చేయాలని.. ఆ తర్వాతే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలన్నది తెలంగాణ వాదన.

అయితే, ముందుగా అనుకున్నట్టుగానే రెండు బోర్డుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ నుంచి ఎవరూ రాకపోవడంతో.. ఏపీ అధికారులతోనే చర్చలు జరిపారు. రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించాక రెండోవారంలో పూర్తిస్థాయి భేటీ నిర్వహిస్తామని తెలిపారు KRMB సభ్యులు.

Read Also… Andhra Pradesh: దివిసీమను భయపెడుతున్న విషసర్పాలు.. మూడు రోజుల్లో 21 మందిని కాటేశాయి..

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.