IND vs ENG, 1st Test Preview: టీమిండియా ఓపెనింగ్‌పై నెలకొన్న ఆసక్తి.. నేటినుంచి ఇంగ్లండ్‌తో తొలిటెస్ట్.. ఇరు జట్ల రికార్డులు, బలాలు ఇవే..!

Venkata Chari

Venkata Chari |

Updated on: Aug 04, 2021 | 9:46 AM

India vs England 1st Test Prediction: పిచ్‌ పేస్‌కు అనుకూలించనుందనే వార్తలతో టీమిండియా నలుగురు ఫాస్ట్ బౌలర్లతో రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేకుండా ఇంగ్లండ్ బరిలోకి దిగనుండడం కొంత ప్రతికూలంగా మారింది.

IND vs ENG, 1st Test Preview: టీమిండియా ఓపెనింగ్‌పై నెలకొన్న ఆసక్తి.. నేటినుంచి ఇంగ్లండ్‌తో తొలిటెస్ట్.. ఇరు జట్ల రికార్డులు, బలాలు ఇవే..!
India Vs England 1st Test Preview

Follow us on

IND vs ENG: క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియా -ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ నేటి నుంచి (బుధవారం) ఆరంభం కానుంది. ఆగష్టు 4 నుంచి 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. తొలిటెస్టు కోసం కోహ్లి సేన, జో రూట్‌ బృందం ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. మరోవైపు ఈ ఏడాది భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్‌ 3-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి స్వదేశంలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో విజయం సాధించి, ప్రతీకారం తీర్చుకోవాలని ఆరాటపడుతోంది. అయితే బెన్ స్టోక్స్ లేకుండానే జో రూట్‌ సేన బరిలోకి దిగుతుండడం కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. భారత్ టీం బలంగానే కనిపిస్తున్నా.. డబ్ల్యూటీసీ ఓటమి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని ఇంగ్లండ్ టీంకు గట్టి పోటీనిచ్చేందుకు సై అంటోంది. కాగా ఇరుజట్లు ఈ సిరీస్‌కు ముందు జరిగిన మ్యాచులలో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలవ్వడం విశేషం.

ఎప్పుడు: ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా, తొలి టెస్ట్, ఆగస్టు 4 నుంచి 8 వరకు, ఇండియా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30గంటలకు

ఎక్కడ: ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్

పిచ్, వాతావరణం: నాటింగ్‌హామ్‌లో రానున్న రెండు నుంచి ఐదు రోజుల వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచుకు వర్షం అడ్డంకి కలిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌‌లో అత్యుత్తమ ఫస్ట్-క్లాస్ పిచ్‌లకు ట్రెంట్ బ్రిడ్జ్ నిలయంగా మారింది. పిచ్‌లో పచ్చగడ్డి ఉండడంతో పేస్ బౌలర్లకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి.

టీంల వార్తలు..

ఇంగ్లండ్: ఆల్ రౌండ్ బెన్ స్టోక్స్ లేకుండానే ఇంగ్లీష్ టీం బరిలోకి దిగనుంది. స్టోక్స్ మానసిక ప్రశాంతత కోసం సిరస్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో టీం స్లోక్స్ స్థానాన్ని ఎలా భర్తీ చేయాలో తెలియని సందిగ్ధంలో ఉంది. అయితే జూన్‌లోనూ న్యూజిలాండ్‌‌తో సిరీస్‌కు స్టోక్స్ అందుబాటులో లేడు. దీంతో ఆ సిరీస్‌లో ఓటమిపాలైంది. అలాగే తొలి టెస్టు కోసం ఇంగ్లండ్ టీం నలుగురు సీమర్లను ఎంచుకున్నారు. అయితే, జాక్ లీచ్‌ని మాత్రం పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. లీచ్‌తో సహా ఐదుగురు బౌలర్లను ఎంచుకోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలా అయితే బ్యాటింగ్‌ను బలహీనపరిచే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఒల్లీ పోప్ క్వాడ్ గాయంతో బాధపడుతున్నాడు. జానీ బెయిర్‌స్టో రీ ఎంట్రీ కోసం సిద్ధంగా ఉన్నాడు.

ఇంగ్లండ్ ప్లేయింగ్ లెవన్: రోరీ బర్న్స్, డోమ్ సిబ్లే, జాక్ క్రాలీ, జో రూట్ (కెప్టెన్), ఒల్లీ పోప్/జానీ బెయిర్‌స్టో, డాన్ లారెన్స్, జోస్ బట్లర్ (కీపర్), ఒల్లీ రాబిన్సన్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్

ఇండియా: మూడేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో పర్యటించిన టీమిండియా 1-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఆ పర్యటనను కేఎల్ రాహుల్ సెంచరీతో ముగించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. టీమిండియా చివరి నాలుగు విదేశీ టెస్టులలో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇలాంటి పరిస్థితులలో ఇద్దరు స్పిన్నర్లు ఆకట్టుకోలేక పోవడంతో మరో పేసర్‌తోనే బరిలోకి దిగనుందని వార్తలు వస్తున్నాయి.

టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్/హనుమ విహారి, ఛతేశ్వర్ పుజరా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ/శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

చివరి ఐదు మ్యాచ్‌లు ఇంగ్లండ్ – ఓటమి, డ్రా, ఓటమి, ఓటమి, ఓటమి ఇండియా- ఓటమి, విజయం, విజయం, విజయం, ఓటమి

ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచుల ఫలితాలు(3 మ్యచ్‌ల్లో టీమిండియా, 2 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించాయి) టీమిండియా ఇన్నింగ్ 25 పరుగులతో విజయం (04 మార్చి 2021) టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం (24 ఫిబ్రవరి 2021) టీమిండియా 317 పరుగుల తేడాతో విజయం (13 ఫిబ్రవరి 2021) ఇంగ్లండ్ టీం 227 పరుగుల తేడాతో విజయం (05 ఫిబ్రవరి 2021) ఇంగ్లండ్ టీం 118 పరుగుల తేడాతో విజయం (07 సెప్టెంబర్ 2018)

మీకు తెలుసా ?

– 2011 నుంచి ఆసియా వెలుపల 100+ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని టీమిండియా సాధించలేదు. ప్రస్తుతం మరో కొత్త ఓపెనింగ్ పెయిర్‌తో తొలి టెస్టు బరిలోకి దిగనుంది.

– 2021 మొదట్లో 228, 186, 218 స్కోర్‌లతో ఘనంగా ప్రారంభించిన జోరూట్.. తన చివరి 11 ఇన్నింగ్స్‌లలో 50 పరుగులు సాధించేందుకు తెగ ఇబ్బంది పడుతున్నాడు.

– 2018 సిరీస్‌లో భారతదేశానికి 8-11 సంఖ్యలు సగటున 11 కాగా, ఇంగ్లాండ్ కొరకు వారు సగటున 21.95 సగటును కలిగి ఉన్నారు, ఇది చివరి సిరీస్ ఫలితాల్లో కీలక భేదం.

– 2018 సిరీస్‌లో కోహ్లీ మొత్తం ఐదు సార్లు టాస్‌లను కోల్పోయాడు

– జేమ్స్ ఆండర్సన్ అనిల్ కుంబ్లే (619) రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. మరో మూడు వికెట్ల పడగొడితే కుంబ్లే ను దాటేయనున్నాడు.

– టీమిండియా చివరగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లు మూడు సార్లు ఆడింది.

స్వాడ్స్: ఇంగ్లాండ్ జట్టు: రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లే, జాక్ క్రాలీ, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, డేనియల్ లారెన్స్, జోస్ బట్లర్ (కీపర్), ఒల్లీ రాబిన్సన్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్, సామ్ కర్రాన్, జాక్ లీచ్ , డొమినిక్ బెస్, ఒల్లీ పోప్, హసీబ్ హమీద్

భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజరా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, అక్సర్ పటేల్ , వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, హనుమ విహారి, అభిమన్యు ఈశ్వరన్

Also Read: IND vs ENG 1st Test: టీమిండియా ఓపెనింగ్ పెయిర్‌పై విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే..? ప్లేయింగ్ 11లో ఎవరుంటారో తెలుసా?

IND vs ENG Live Streaming: నేటి నుంచి ఇండియా-ఇంగ్లండ్ టీంల మధ్య తొలి టెస్టు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్ టీంలకు గుడ్ న్యూస్.. రంగంలోకి స్టార్ ప్లేయర్లు.. ఇక ఫ్యాన్స్‌కి పండగే

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu