అమృత్‌సర్ లోని ఆసుపత్రిలోనే గ్యాంగ్ స్టర్ పై కాల్పులు.. గాయపడిన రానా..
అమృత్ సర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోనే ఐసీయూ బయట నిన్న రాత్రి జరిగిన కాల్పుల ఘటనలో రణబీర్ సింగ్ ఎలియాస్ రానా కండోవాలియా అనే గ్యాంగ్ స్టర్ గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
అమృత్ సర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోనే ఐసీయూ బయట నిన్న రాత్రి జరిగిన కాల్పుల ఘటనలో రణబీర్ సింగ్ ఎలియాస్ రానా కండోవాలియా అనే గ్యాంగ్ స్టర్ గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. భటిండా జైల్లో శిక్ష అనుభవిస్తున్న మరో గ్యాంగ్ స్టర్ జగ్గు భగవాన్ పురియాకు, ఇతనికి మధ్య పాత కక్షలున్నట్టు వారు చెప్పారు. వరుసకు తన సోదరి అయ్యే ఓ మహిళ ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమెను చూసేందుకు వచ్చిన రానా.పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని, వారు జగ్గు సహచరులే అయి ఉండవచ్చునని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో రానా అనుచరుడు తేజ్ బీర్ సింగ్ ఎలియాస్ తేజాతో బాటు ఆసుపత్రి గార్డు కూడా గాయపడ్డాడు. తేజా శిరోమణి అకాలీదళ్ విద్యార్ధి విభాగం నాయకుడని తెలుస్తోంది. తేజా, ఆసుపత్రి గార్డు ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో రానా తల, భుజం, కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి.
రానాకు రక్షణగా ఉన్న తేజా కూడా ఫైర్ చేశాడని, అయితే దుండగులు పారిపోయారని తెలుస్తోంది. ఆసుపత్రిలోనే ఈ ఘటన జరగడంతో హాస్పిటల్ సిబ్బంది. రోగులు భయాందోళన చెందారు. 20`6 లో జరిగిన పట్టి గ్యాంగ్ వార్ లో రానా ప్రధాన నిందితుడని పోలీసులు చెప్పారు. ఆ ఏడాదిలో బాబీ మల్హోత్రా, దేవేందర్ గ్యాంగుల మధ్య కాల్పులు జరిగాయి. పంజాబ్ లో నాడు పట్టి గ్యాంగ్ వార్ పతాక శీర్షికలకెక్కింది. ఆ నాటి నుంచే రానా నిందితునిగా పోలీసు రికార్డులకెక్కాడు. .+
మరిన్ని ఇక్కడ చూడండి : ఛాయ్ అమ్మిన ఎమ్మెల్యే…ఒక్క ఛాయ్ 15 లక్షలు.. మీకు కావాలా..? ఎందుకో తెలుసా.?:MLA sold by Chai Video.
పాపం వధువును కష్టపెట్టిన వరుడు..! రోడ్డుపైనే వరమాల సందడి.. చివరకి ఎం అయ్యింది..:Bride Viral Video