AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Employees: ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు.. ఉదయం 7.30 నుంచి 2.00 వరకే ఆఫీస్..

విద్యుత్తును ఆదా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పంజాబ్ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి 7.30 నుంచి 2.00 వరకే అధికారులు పనిచేయనున్నారు. ఇది కేవలం ఉద్యోగులకే కాకుండా మంత్రుల నుంచి సీఎం వరకు అందరికి ఇదే రూల్‌ వర్తించనుంది.

Govt Employees: ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు.. ఉదయం 7.30 నుంచి 2.00 వరకే ఆఫీస్..
Office Timings
Shiva Prajapati
|

Updated on: May 03, 2023 | 7:32 AM

Share

విద్యుత్తును ఆదా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పంజాబ్ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి 7.30 నుంచి 2.00 వరకే అధికారులు పనిచేయనున్నారు. ఇది కేవలం ఉద్యోగులకే కాకుండా మంత్రుల నుంచి సీఎం వరకు అందరికి ఇదే రూల్‌ వర్తించనుంది.

పంజాబ్​సీఎం భగవంత్​ మాన్.. మంగళవారం ఉదయం 7.30కే తన కార్యాలయానికి చేరుకున్నారు. తన కుర్చీలో ఆసీనులై.. పలు పత్రాలపై సంతకాలు చేశారు. అయితే అంత పొద్దున్న కార్యాలయానికి ముఖ్యమంత్రి రావడానికి కారణం ఉంది. పంజాబ్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త టైమింగ్స్​అమల్లోకి వచ్చాయి. ఉదయం 9 నుంచి 5.30 వరకు బదులు.. 7.30 నుంచి 2.00 వరకే అధికారులు పనిచేయనున్నారు. జులై 15 వరకు కొత్త టైమింగ్స్ అమల్లో ఉండనున్నాయి. విద్యుత్​ఆదాతో పాటు అనేక ప్రయోజనాల నిమిత్తం పంజాబ్​సర్కార్​ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త టైమింగ్స్​ ద్వారా రెండున్నర నెలల వ్యవధిలో రూ. 40-42 కోట్ల ఆదా అవుతుందని సీఎం మాన్​అంచనా వేశారు. కొత్త టైమింగ్స్ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు ఉద్యోగులతో పాటు ప్రజలతో మాట్లాడినట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటలకు మూసివేస్తే రోజుకు దాదాపు 350 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గుతుందని.. ఫలితంగా విద్యుత్ బిల్లులపై నెలకు రూ.16-17 కోట్లు ఆదా అవుతుందన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పనివేళల మార్పులు కేవలం ఉద్యోగులకే కాకుండా మంత్రుల నుంచి సీఎం వరకు నిర్ణయించిన సమయంలోనే ఆఫీసులకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం పంజాబ్‌లో అమలవుతున్న ఆఫీసుల కొత్త టైమింగ్స్.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో కూడా అమలు చేయాలని సూచించారు. అప్పుడు ట్రాఫిక్​ సమస్యలు కూడా తీరుతాయని అభిప్రాయపడ్డారు. అయితే జులై 15 తర్వాత ఈ కొత్త సమయ వేళలపై మరోసారి సమీక్ష నిర్వహిస్తామన్నారు సీఎం భగవంత్ మాన్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..