Pregnant DSP: మండుటెండలో విధులు నిర్వహిస్తున్న నిండు గర్భిణి.. లేడీ సింగంను ప్రశంసలతో ముంచెత్తున్న నెటిజన్లు

కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం గస్తీ కాస్తున్నారు పోలీసులు. ప్రజలను రక్షించేందుకు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలందిస్తున్నారు.

Pregnant DSP: మండుటెండలో విధులు నిర్వహిస్తున్న నిండు గర్భిణి.. లేడీ సింగంను ప్రశంసలతో ముంచెత్తున్న నెటిజన్లు
Pregnant Dsp Shilpa Sahu
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 22, 2021 | 5:33 PM

Pregnant DSP Shilpa Sahu: కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం గస్తీ కాస్తున్నారు పోలీసులు. ప్రజలను రక్షించేందుకు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలందిస్తున్నారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో ఓ మహిళా అంతకు మించి అన్న రీతిలో తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. నిండి గర్భంతో ఉన్నా మండుటెండలో నిలబడి విధులు నిర్వహిస్తున్నారు.

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించగా.. సక్రమంగా అమలు చేయడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే క్రమంలో చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన డీఎస్పీ శిల్పా సాహు నిండు గర్బిణి అయినప్పటికీ లాఠీ పట్టుకుని రోడ్లపై డ్యూటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన దంతేవాడ డివిజన్‌లో ఆమె ఇలా విధులు నిర్వహిస్తున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఆమె రోడ్లపై తిరుగూ ప్రజలకు కరోనా వైరస్ నియమనిబంధనలు తెలియజేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

శిల్పా సాహుకు ఉన్న నిబద్ధతను చూసిన నెటిజనులు.. ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విధుల పట్ల ఆమెకు ఉన్న అంకితభావాన్ని కొనియాడుతున్నారు. కరోనా మహమ్మారికి సైతం భయపడకుండా ఆమె చేస్తున్న సేవకు సెల్యూట్ చేయాల్సిందేనని అంటున్నారు. అయితే, కొందరు గర్భంతో ఆమె విధులు నిర్వహించడంపై ఆందోళన చెందుతున్నారు. కడుపులో బిడ్డ కూడా జాగ్రత్త అని ఆమెకు సూచిస్తున్నారు. మరోవైపు, గర్భంతో ఉన్న ఆమెకు సెలవు ఇవ్వకుండా పనులు చేయించుకోవడం పట్ల పోలీసు ఉన్నతాధికారులపై సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు శక్తి వంచన లేకుండా శిల్పా సాహు విశ్రమిస్తున్నారు. ఓ వైపు శాంతి భద్రతలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే మరోవైపు కరోనా కట్టడి చర్యలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మాస్కు లు ధరించని వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. గర్భిణి అయ్యినప్పటికీ రెస్ట్ తీసుకోకుండా విధుల నిర్వహిస్తున్న ఆమెను చూసిన స్థానికుల అభినందనలతో ముంచెత్తున్నారు.

Read Also…  మొబైల్ ఫోన్స్ వాడే వారికి హెచ్చరిక.. ఆ మెసేజ్‏లతో హెచ్చరిస్తున్న coai.. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే ఇక..