BJP: ఆ నినాదమే కొంప ముంచింది.. ఎన్నికల్లో బీజేపీ పనితీరుపై ప్రశాంత్ కిశోర్ విశ్లేషణ

ఎన్నికల ప్రచారంలో నినాదాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అవి పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ప్రచారంలో పాల్గొనేలా చేయడమే కాదు, జనబాహుళ్యంలోనూ ప్రభావం చూపుతుంటాయి. ఐదేళ్ల పాలన అనంతరం 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేయాలంటూ భారతీయ జనతా పార్టీ (BJP) ప్రచారం చేసింది. ఈ క్రమంలో "ఫిర్ ఏక్ బార్.. మోదీ సర్కార్ (మరోసారి మోదీ ప్రభుత్వం)" అన్న నినాదాన్ని ఇచ్చింది. ఇది జనంలో విస్తృతంగా వెళ్లింది. మొత్తంగా 2014తో పోల్చితే 2019లో బీజేపీకి సొంతంగానే మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చాయి.

BJP: ఆ నినాదమే కొంప ముంచింది.. ఎన్నికల్లో బీజేపీ పనితీరుపై ప్రశాంత్ కిశోర్ విశ్లేషణ
Prashanth Kisore
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 08, 2024 | 9:35 AM

ఎన్నికల ప్రచారంలో నినాదాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అవి పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ప్రచారంలో పాల్గొనేలా చేయడమే కాదు, జనబాహుళ్యంలోనూ ప్రభావం చూపుతుంటాయి. ఐదేళ్ల పాలన అనంతరం 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేయాలంటూ భారతీయ జనతా పార్టీ (BJP) ప్రచారం చేసింది. ఈ క్రమంలో “ఫిర్ ఏక్ బార్.. మోదీ సర్కార్ (మరోసారి మోదీ ప్రభుత్వం)” అన్న నినాదాన్ని ఇచ్చింది. ఇది జనంలో విస్తృతంగా వెళ్లింది. మొత్తంగా 2014తో పోల్చితే 2019లో బీజేపీకి సొంతంగానే మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చాయి. బీజేపీ చరిత్రలోనే తొలిసారిగా 300 మార్కు దాటి, 303కు చేరుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మరో ఐదేళ్లు పదవీకాలం పూర్తిచేసుకున్న మోదీ సర్కారు 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన నినాదం ఏమాత్రం ప్రభావం చూపలేదు. గతం కంటే సంఖ్య పెరగడం మాట దేవుడెరుగు.. కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడా సొంతంగా సాధించలేక చతికిలపడింది. ఇంకా చెప్పాలంటే ఆ నినాదమే బెడిసికొట్టిందని కొందరు విశ్లేషిస్తున్నారు. “అబ్ కీ బార్.. చార్ సౌ పార్ (ఈసారి 400 దాటాలి)” అన్న నినాదం నిజానికి కొన్ని రాష్ట్రాల్లో మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ.. గత ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లను కట్టబెట్టిన పెద్ద రాష్ట్రాల్లో మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. మొత్తమ్మీద 400 సీట్లు దాటి గెలవాలని ప్రయత్నిస్తే.. సొంతంగా కాదు కదా.. కూటమిగా కూడా సాధించలేక.. సొంతంగా 240, కూటమిగా 293 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన ఫలితం ఎదురైంది.

ఒక్క నినాదం.. చిలువలు పలువలుగా..!

దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజానాడి గురించి ఎప్పటికప్పుడు విశ్లేషణలు అందజేసే ప్రముఖ సెఫాలజిస్టు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యం గురించి కూడా విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో ఆయన విశ్లేషణ నూటికి నూరుపాళ్లు నిజమైనప్పటికీ.. కేంద్రంలో బీజేపీ సాధించిన విషయంలో ఆయన అంచనాలు కొంతమేర తప్పాయి. అందుకు కారణాలను విశ్లేషిస్తూ.. ఆయన మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న 400 సీట్లు రాకపోయినా.. సొంతంగా 300 సీట్లు సాధిస్తుందని ప్రశాంత్ కిశోర్ ఎన్నికలకు ముందు అంచనాలు వెల్లడించారు. కానీ ఇంత పేలవమైన ప్రదర్శన తర్వాత ఫలితాల సరళిని విశ్లేషించుకుని.. అందుకు దారితీసిన కారణాలను వెల్లడించారు. “అబ్ కీ బార్.. చార్ సౌ పార్” అన్న నినాదాన్ని ప్రజలు మోదీ సర్కారు అహంకారానికి నిదర్శనంగా భావించారని పీకే చెబుతున్నారు. ఎవరైనా గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకుంటారు.. కానీ సీట్ల సంఖ్యను కూడా లక్ష్యంగా పెట్టుకోవడం.. ప్రధాని మోదీ సైతం మూడోసారి అధికారంలోకి వస్తే మరిన్ని సంచలన, కఠిన నిర్ణయాలు ఉంటాయని ప్రచారంలో చెప్పడం కూడా జనంలో సరికొత్త సందేహాలకు తావిచ్చింది. గతంలో కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల్లో రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామని చెప్పినవి ఈ సందర్భంగా తెరపైకి వచ్చాయి. ఈసారి 400 సీట్లు మించి గెలవాలని కోరుకుంటున్నారంటే.. రాజ్యాంగాన్ని మార్చేయడం కోసమే అన్న అనుమానాలు తలెత్తాయి. ప్రతిపక్షాలు సైతం ఇదే విషయాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకున్నారు. బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటోందని, అందుకే 400కు పైగా సీట్లు కోరుకుంటోందని విమర్శించాయి. ఇంకో అడుగు ముందుకేసి, ఎక్కడో ఎవరో అనామక బీజేపీ అనుంబంధ సంఘాల నేత రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు ప్రాచుర్యం కల్పించాయి. మూడోసారి అధికారంలోకి వస్తే బీజేపీ రిజర్వేషన్లను తొలగిస్తుంది అంటూ విస్తృత దుష్ప్రచారానికి పాల్పడ్డాయి.

పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్-2 స్థానంలో ఉన్న అమిత్ షా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ సభలో “తాము అధికారంలోకి వస్తే మతం ఆధారంగా ఇస్తున్న ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం” అంటూ చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేసి.. “తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తొలగిస్తాం” అన్నట్టుగా మార్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచే ఈ వీడియోలను పోస్ట్ చేశారు. నిజానికి ఆయన చేసిన ప్రసంగంలో తొలగిస్తామన్నది మతం ఆధారంగా ఇస్తున్న ముస్లిం రిజర్వేషన్లను మాత్రమే. ఆ తర్వాతి వాక్యంలో నిజానికి ఈ రిజర్వేషన్ ఫలాలు దక్కాల్సింది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అని చెప్పారు. అంటే ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఈ మూడు వర్గాలకు నష్టం కలుగుతుందని చెప్పడమే ఆయన ఉద్దేశం. కానీ దాని అర్థమే మార్చేలా వీడియోను ఎడిట్ చేసేసరికి.. ఏ వర్గాలను ఆకట్టుకోవాలని అనుకున్నారో.. ఆ వర్గాలే బీజేపీని అనుమానించాయి. ఇదిలా ఉంటే.. తమ పదేళ్ల పరిపాలన కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలు సైతం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి.

ఇవి కూడా చదవండి

ప్రశాంత్ కిశోర్ విశ్లేషణలో మరో ముఖ్యమైన అంశం.. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో తమ పార్టీపై అంతులేని భక్తి, ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ.. చాలా చోట్ల వారు అభ్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరున్న బీజేపీలో.. ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకొచ్చి టికెట్లు ఇవ్వడం చాలా మంది కార్యకర్తలకు ఏమాత్రం నచ్చలేదు. మరికొన్ని చోట్ల మొదటి నుంచీ బీజేపీలోనే ఉన్న అభ్యర్థిపై కూడా కార్యకర్తల్లో అసహనం, ఆగ్రహం వ్యక్తమైంది. ఇందుకు ఆయా అభ్యర్థుల ప్రవర్తన, నడవడిక కారణమై ఉంటుంది. మొత్తంగా తమకు నచ్చని అభ్యర్థికి గుణపాఠం చెప్పాలనుకున్నారు. ప్రచారంలో సహాయ నిరాకరణ చేశారు. ఇలాంటి ఉదంతాలు కూడా ఆశించిన ఫలితాలు రాకుండా అడ్డుకుందని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్