PM Modi 3.0: మూడోసారి ప్రధాన మంత్రి.. అద్వానీ సహా అగ్రనేతల అశీర్వాదం తీసుకున్న నరేంద్ర మోదీ..!

ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత బిజీ బిజీగా గడిపారు నరేంద్ర మోదీ. బీజేపీ సీనియర్ నేతలని కలిసి ఆశీర్వాదం తీసుకుని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. ఆ తర్వాత ఎన్డీఏ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించారు రాష్ట్రపతి ముర్ము.

PM Modi 3.0: మూడోసారి ప్రధాన మంత్రి.. అద్వానీ సహా అగ్రనేతల అశీర్వాదం తీసుకున్న నరేంద్ర మోదీ..!
Modi Meets Bjp Stalwart
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 07, 2024 | 7:01 PM

ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత బిజీ బిజీగా గడిపారు నరేంద్ర మోదీ. బీజేపీ సీనియర్ నేతలని కలిసి ఆశీర్వాదం తీసుకుని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. ఆ తర్వాత ఎన్డీఏ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించారు రాష్ట్రపతి ముర్ము.

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత, బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీని కలిశారు నరేంద్ర మోదీ. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఆయన వద్ద ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్‌ నేత అద్వానీకి పుష్పగుచ్ఛం అందించారు మోదీ. అద్వానీ కుమార్తె ప్రతిభ కూడా అక్కడే ఉన్నారు. అద్వానీ ఇంటి నుంచి నేరుగా బీజేపీ వ్యవస్థాపకుల్లో మరొకరు మురళీ మనోహర్ జోషి ఇంటికి వెళ్లారు మోదీ. ఆయన పుష్పగుచ్చం అందించి.. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం జరిగే ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. రెండు సార్లు బీజేపీ స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా మెజారిటీ సాధించడంలో నేతలిద్దరూ పెద్దన్న పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఇంటికి వెళ్లారు ప్రధాని మోదీ. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా నరేంద్ర మోదీ కలిశారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి మోదీకి స్వీట్లు తినిపించారు. ఆయనను కూడా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. కోవింద్ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కమిటీకి రామ్‌నాథ్ కోవింద్ చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి ముందు, రాజ్యాంగ భవనంలోని సెంట్రల్ హాల్‌లో జరిగిన ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు.

సాయంత్రం ఆరున్నరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ఎన్డీఏ పక్ష నేత నరేంద్ర మోదీ. మిత్రపక్షాలు, ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు సరిపడ బలం ఉందని చెప్పిన తర్వాత.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ.. అధికారికంగా మోదీకి లేఖ ఇచ్చారు రాష్ట్రపతి. ఆదివారం సాయంత్రం 6గంటలకు మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు.

ఈసారి బీజేపీ 240 సీట్లు గెలుచుకుంది. ఎన్డీయేలో రెండో అతిపెద్ద పార్టీ టీడీపీ. వీరికి 16 మంది ఎంపీలు ఉన్నారు. అదే సమయంలో నితీష్ కుమార్ జేడీయూ మూడో స్థానంలో ఉంది. జేడీయూ ఈసారి 12 సీట్లు గెలుచుకుంది. ఇది కాకుండా, రామ్ విలాస్ పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన, మహారాష్ట్రలో 5 మంది ఎంపీలు ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..