PM Modi: ‘ఎన్డీయే అనేది భారతదేశపు ఆత్మ’.. మిత్రపక్షాల నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక..

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. పవన్ అంటే పవన్ కాదు ఒక తుఫాన్ అన్నారు. ఏపీలో చంద్రబాబు చారిత్రాత్మక విజయం సాధించారన్నారు. పవన్ వల్లే ఏపీలో భారీ విజయం లభించిందని కీర్తించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ముందుగా ఎన్డీయే మిత్రపక్షాల కార్యకర్తలకు శిరసువంచి నమస్కరిస్తున్నానన్నారు మోదీ. ఎన్డీయే గెలుపుకు శ్రమించిన కార్యకర్తలందరికీ అభినందనలు తెలిపారు. ఇవాళ పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో జరిగిన సమావేశంలో ఎన్డీయేపక్ష నేతగా నరేంద్రమోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

PM Modi: 'ఎన్డీయే అనేది భారతదేశపు ఆత్మ'.. మిత్రపక్షాల నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక..
Pm Modi
Follow us
Srikar T

|

Updated on: Jun 07, 2024 | 1:40 PM

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. పవన్ అంటే పవన్ కాదు ఒక తుఫాన్ అన్నారు. ఏపీలో చంద్రబాబు చారిత్రాత్మక విజయం సాధించారన్నారు. పవన్ వల్లే ఏపీలో భారీ విజయం లభించిందని కీర్తించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ముందుగా ఎన్డీయే మిత్రపక్షాల కార్యకర్తలకు శిరసువంచి నమస్కరిస్తున్నానన్నారు మోదీ. ఎన్డీయే గెలుపుకు శ్రమించిన కార్యకర్తలందరికీ అభినందనలు తెలిపారు. ఇవాళ పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో జరిగిన సమావేశంలో ఎన్డీయేపక్ష నేతగా నరేంద్రమోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోదీ పేరును రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపాదిస్తే అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ బలపరిచారు. ఎన్డీయేపక్ష నేతగా 3వ సారి ఎన్నికైన నరేంద్రమోదీ.. ప్రధానిగా సేవలు అందించబోతున్నారు. ఎన్డీయే పక్ష సమావేశానికి హాజరైన మోదీ.. రాజ్యాంగానికి ప్రణామం చేసి ఉద్వేగంగా కనిపించారు. ఆ తరువాత పార్లమెంటరీ పక్షనేతగా ప్రసంగించిన మోదీ కార్యకర్తలను ఆకాశానికి ఎత్తేశారు. 22రాష్ట్రాల్లో ఎన్డీయే మిత్రపక్షాలు కలిసి ఉన్నాయన్నారు. విశ్వాసం అనే బంధం తమను కలిపిందని అన్నారు. ఎండనకా, వాననకా కష్టపడి పనిచేసి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తల గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుందన్నారు. అయితే ప్రభుత్వం నడపడానికి అందరి సహకారం అవసరం అన్నారు. అందుకే మిత్రపక్షాల మద్దతు తీసుకున్నానన్నారు.గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారన్నారు. తనపై నమ్మకంతో దేశ బాధ్యతలు అప్పగించారన్నారు. భారత స్పూర్తికి మన ఎన్డీయే కూటమి ఉదాహరణ అన్నారు.

ఎన్డీయే అనేది భారతదేశపు ఆత్మ అని కొనియాడారు. ఎన్నికలకు ముందే కూటమి గట్టి విజయం సాధించడం ఒక గొప్ప చరిత్ర అన్నారు. ఇవి నాకు భావోద్వేగ క్షణాలని వివరించారు. ఏపీలో ప్రజలు ఎన్డీయే కూటమికి చారిత్రాత్మక విజయం అందించారన్నారు. తెలుగురాష్ట్రాల్లో ప్రజలు ఎన్డీయేని బలపరిచారని చెప్పారు. గెలుపును ఎంత ఆస్వాధిస్తామో, పరాజితులను కూడా అంతే గౌరవిస్తామన్నారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి నేతలను విమర్శించారు. తమిళనాడులో ఎన్డీయే కూటమికి సీట్లు రాకపోవచ్చు.. అక్కడ ఏం జరుగుతుందో మున్ముందు ఉంటుందని చెప్పారు. ఇక విజయం సాధించి ఇక్కడికి వచ్చిన ప్రతిఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీలు అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లో ఎన్డీయేకు అత్యధిక స్థానాలు ఇచ్చారన్నారు. అలాగే ఆదివాసీలు ఎక్కువగా ఉన్న 7 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్, గుడ్ గవర్నెన్స్ అందిస్తామని మాట ఇచ్చారు. ఇదే ఎన్డీయే స్పూర్తి అని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా దేశంలో ఎన్డీచే కూటమి నడుస్తోందని చెప్పారు. పేదరిక నిర్మూలనతోనే దేశం అభివృద్ది చెందుతుందన్నారు. గత పదేళ్లలో పేదరికాన్ని నిర్మూలించామన్నారు. రానున్న రోజుల్లో కూడా మరింత అభివృద్దికి, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతామన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు, కూటమి నేతలు మోదీకి సాదర స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నితీష్‌ సహా 9 మంది ఎన్డీయే మిత్రపక్షాల నేతలు వేదికపై ఉన్నారు. దీంతో ఇవాళ పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో సందడి వాతావరణం కనిపించింది. కూటమి నేతలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ముఖ్యనేతలు కూడా హాజరయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..