NDA Meeting: ఎన్డీయే పక్ష నేతగా మోదీ.. ఘనంగా సన్మానించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీని ఘనంగా సత్కరించి శాలువా కప్పి దేవుడి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఎన్డీయే మిత్రపక్షాల నేతలు ఆయన వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా తమ లోక్‌సభా పక్ష నేతగా మోదీని ఎన్డీయే నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. సుపరిపాలనతో ఎన్డీయే కూటమి అసలైన భారత్ స్ఫూర్తిని చాటుతుందని మోదీ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీని ఘనంగా సత్కరించి శాలువా కప్పి దేవుడి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఎన్డీయే మిత్రపక్షాల నేతలు ఆయన వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈక్రమంలోనే ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, విజన్ 2047 దిశగా అడుగులు వేస్తున్న మోదీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మోదీ.. దేశాన్ని ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా నిలిపారని గుర్తు చేశారు. మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్‌కు భరోసా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. వీడియో చూడండి…
మోదీ 15 ఏళ్లు దేశానికి ప్రధానిగా సేవలందిస్తారని.. 2014లో చంద్రబాబు చెప్పారని, అది నిజమైందని పవన్ కల్యాణ్ అన్నారు. యావత్‌దేశానికి మోదీ ప్రేరణ ఇచ్చారని, ఆయన మార్గదర్శనం వల్లే దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. మరోవైపు, మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారయ్యింది. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు కొత్త సర్కార్ కొలువు తీరుతుంది. ఈ క్రమంలో ఇవాళ ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం జరగింది. ఇదే సమయంలో మంత్రి పదవులపైనా ఇంట్రస్టింగ్ చర్చ జరుగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…