బెంగుళూరు సెంట్రల్ జైలు, రౌడీ షీటర్ల ఇళ్లపై పోలీసుల ఆకస్మిక దాడులు.. కత్తులు, డ్రగ్స్ స్వాధీనం

బెంగుళూరు లోని సిటీ క్రైమ్ బ్రాంచి పోలీసులు శనివారం తెల్లవారు జామున పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుపైన,.. నగరంలోని రౌడీ షీటర్ల ఇళ్ల పైన ఏకకాలంలో సోదాలు, దాడులు జరిపారు.

బెంగుళూరు సెంట్రల్ జైలు, రౌడీ షీటర్ల ఇళ్లపై పోలీసుల ఆకస్మిక దాడులు.. కత్తులు, డ్రగ్స్ స్వాధీనం
Police Raid
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 10, 2021 | 1:59 PM

బెంగుళూరు లోని సిటీ క్రైమ్ బ్రాంచి పోలీసులు శనివారం తెల్లవారు జామున పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుపైన,.. నగరంలోని రౌడీ షీటర్ల ఇళ్ల పైన ఏకకాలంలో సోదాలు, దాడులు జరిపారు. మొదట జైల్లో నిర్వహించిన దాడుల్లో పెద్ద సంఖ్యలో కత్తులు, సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, గంజాయి, మారిజువానా, తదితర డ్రగ్స్ ను కనుగొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. జామర్లు ఉన్నప్పటికీ ఈ మొబైల్ ఫోన్లు తదితరాలు ఖైదీలకు ఎలా అందాయో తెలియడంలేదని, వీటిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని పోలీసు జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. ఇందులో జైలు సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అని ఆరా తీస్తామన్నారు. ఈ నెల రోజుల కాలంలో నగరంలో నేరాలు పెరిగిపోవడంతో తాము ఈ దాడులకు దిగినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ఈ సెంట్రల్ జైలు అతి పెద్దది. సుమారు 40 ఎకరాల స్థలంలో ఉన్న ఈ జైల్లో 800 పైగా బరాక్ లు ఉన్నాయి. దాదాపు 4 వేల మంది ఖైదీలున్నారు. అత్యంత భద్రతతో ఉండాల్సిన ఈ జైల్లో ఈ వస్తువులన్నీ ఎలా వచ్చాయో చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

అటు నగరంలోని 108 మందికి పైగా హిస్టరీ షీటర్లు, రౌడీ షీటర్ల ఇళ్లపై కూడా ఏకకాలంలో పోలీసులు తమ డాగ్ స్క్వాడ్ బృందాలతో సహా రైడ్స్ నిర్వహించారు. ఈ దాడుల్లో కొన్ని ఆయుధాలను, డ్రగ్స్ ను, అక్రమంగా కలిగి ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కొందరిపై మళ్ళీ కేసులు పెట్టారు. ఇటీవల రెండు వారాల వ్యవధిలో పట్టపగలు సిటీలో రెండు హత్యలు జరిగాయి. మదన్ అనే ఫైనాన్షియర్ ని, రేఖా దిరేషీ అనే మాజీ కౌన్సిలర్ ని దుండగులు దారుణంగా హత్య చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Beggar Donations: భిక్షాటన సొమ్ము కరోనా నివారణ, విద్యార్థుల చదువులకు సాయం.. దానశీలిగా మారిన వృద్దుడు

Xiaomi 67w Fast Charger: షియోమి నుంచి 67w సూపర్ ఫాస్ట్ చార్జర్.. విడుదల ఎప్పుడంటే..!