AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi 67w Fast Charger: షియోమి నుంచి 67w సూపర్ ఫాస్ట్ చార్జర్.. విడుదల ఎప్పుడంటే..!

Xiaomi 67w Fast Charger: చైనాకు చెందిన షియోమి ఒక వైపు తన కొత్త కొత్త మోడళ్ల మొబైళ్లను మార్కెట్లో విడుదల చేస్తుండగా, మరో వైపు ఫాస్ట్‌ ఛార్జర్లను విడుదల చేస్తోంది..

Xiaomi 67w Fast Charger: షియోమి నుంచి 67w సూపర్ ఫాస్ట్ చార్జర్.. విడుదల ఎప్పుడంటే..!
Xiaomi 67w Fast Charge
TV9 Telugu Digital Desk
| Edited By: Subhash Goud|

Updated on: Jul 10, 2021 | 1:41 PM

Share

Xiaomi 67w Fast Charger: చైనాకు చెందిన షియోమి ఒక వైపు తన కొత్త కొత్త మోడళ్ల మొబైళ్లను మార్కెట్లో విడుదల చేస్తుండగా, మరో వైపు ఫాస్ట్‌ ఛార్జర్లను విడుదల చేస్తోంది. తాజాగా షియోమి 67w చార్జర్‌ను జూలై 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ చార్జర్‌ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ల్యాప్‌టాప్‌, ఇతర టైప్‌-సి వాటికి అనుకూలంగా ఉంటుందని తెలిపింది. షియోమి తన వెబ్‌సైట్‌లో కొత్త చార్జర్‌ కోసం ప్రత్యేక పేజీని క్రియేట్‌ చేసింది. ఈ చార్జర్‌ అత్యంత శక్తివంతమైనదిగా పేర్కొంది.

అయితే దీనికి సంబంధించిన పలు ఫీచర్లు కూడా ఇప్పటికే లీకయ్యాయి. అయితే దీని ధర ఎంత ఉండనుందో మాత్రం లాంచ్ సమయంలోనే తెలిసే అవకాశం ఉంది. యూఎస్‌బీ టైప్-ఏ నుంచి టైప్-సీకి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. 67 వాట్ల పవర్‌తో ఇది డివైస్‌లను చార్జ్ చేయగలదు. పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌తో పాటు ఈ చార్జర్ అందిస్తున్నారు. అయితే మనదేశంలో మాత్రం దీన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిందే. క్వాల్‌కాం క్విక్ చార్జ్ 3.0 ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీంతోపాటు ఇన్‌బిల్ట్ సర్జ్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా ఈ చార్జర్ పొందడం విశేషం. ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు సహా.. అన్ని యూఎస్‌బీ టైప్-సీ డివైస్‌లను ఇది సపోర్ట్ చేయనుంది.

ఇవీ కూడా చదవండి:

Google Pixel 6: ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ నుంచి రెండు వేరియంట్లలో స్మార్ట్‌ఫోన్లు.. అత్యాధుని ఫీచర్స్‌

Realme: ‘రియల్ మీ’ సంచలనం.. రూ. 5 వేలులోపే అధునాతన ఫీచర్లతో సూపర్ ఫోన్లు..