AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిశాలో తప్పిన పెను ప్రమాదం.. రెండు ముక్కలైన వంతెన.. చివరికి

ఒడిశాలోని జాజ్‌పుర్ జిల్లాలో అనూహ్య ఘటన జరిగింది. కొల్‌కతాను కలిపే నేషనల్ హైవే-16 పై ఓ వంతెన రెండు ముక్కలు కావడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఎన్‌హెచ్-16 పై రసూల్‌పూర్ వద్ద గతంలో రెండు వంతెనలు నిర్మించారు.

ఒడిశాలో తప్పిన పెను ప్రమాదం.. రెండు ముక్కలైన వంతెన.. చివరికి
Bridge Collapse
Aravind B
|

Updated on: Jul 19, 2023 | 7:45 AM

Share

ఒడిశాలోని జాజ్‌పుర్ జిల్లాలో అనూహ్య ఘటన జరిగింది. కొల్‌కతాను కలిపే నేషనల్ హైవే-16 పై ఓ వంతెన రెండు ముక్కలు కావడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఎన్‌హెచ్-16 పై రసూల్‌పూర్ వద్ద గతంలో రెండు వంతెనలు నిర్మించారు. అయితే తాజాగా భూవనేశ్వర్ వైపు ఓ బస్సు వెళ్తుండగా అందులోని ఓ వంతెనను దాటేసింది. దీంతో ఈ బ్రిడ్జి నిర్మాణంలోని ఓ స్పాన్ పెద్ద శబ్దంతో కిందకి జారి పడిపోయింది. అటుగా వెళ్తున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు కౌఖాయ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హోం గార్డు ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ బ్రిడ్జి పైకి వాహనాల రాకపోకలను ఆపేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం వాహనాలను ఆ వంతెనపైకి రాకుండా దారి మళ్లించారు. భువనేశ్వర్‌కు చెందిన బస్సు ఆ వంతెన దాటి వెళ్లిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వాహనం కూడా ఆ బ్రిడ్జి దాటిందని హోంగార్డు చెప్పారు. ఆ తర్వాత వాహనాల రాకపోకలను నిలిపివేశామని తెలిపారు. ఇదిలా ఉండగా.. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 2008లో ఈ వంతెన నిర్మించారని.. నిర్మాణ వైఫల్యాల వల్లే బ్రిడ్జి కూలిపోయి ఉండొచ్చని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జేపీ వర్మ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..