PM Modi: నవ భారత నిర్మాణమే మా లక్ష్యం.. ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలు సమావేశంలో ప్రధాని మోదీ..

NDA Meeting: అవినీతి అంతానికి పంతం పట్టామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) సమావేశం మంగళవారం (జూలై 18) ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను..

PM Modi: నవ భారత నిర్మాణమే మా లక్ష్యం.. ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలు సమావేశంలో ప్రధాని మోదీ..
PM Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 18, 2023 | 10:14 PM

PM Modi Speech: వారసత్వ పార్టీల కూటమి నిలబడదు.. అవినీతి అంతానికి పంతం పట్టామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) సమావేశం మంగళవారం (జూలై 18) ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. 1990వ దశకంలో దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ కూటమిని ఉపయోగించుకుందని, మరోవైపు ఎన్డీయే ఏర్పడింది ఎవరినీ తొలగించేందుకు కాదని, సుస్థిరత తీసుకురావాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సానుకూల రాజకీయాలు చేశామని ప్రధాని మోదీ అన్నారు. తాము ఎప్పుడూ ప్రతికూల రాజకీయాలు చేయలేదు. ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వాలను ఎదిరించి వారి కుంభకోణాలను బయటపెట్టాం తప్ప అధికారాన్ని అవమానించలేదు. తాము విదేశీ దళాల సహాయం కూడా అడగలేదన్నారు.

బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశంలో ప్రధాని మోదీ విమర్శల దాడి చేస్తూ.. ఇంతమంది దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే మేం ఏకం చేస్తున్నామని అన్నారు. వీళ్లు ఎందుకు ఏకమవుతున్నారో జనం చూస్తున్నారని అన్నారు. వాటిని కలుపుతున్న జిగురు ఏది అని ప్రజలు చూస్తున్నారు.

కేరళలో కాంగ్రెస్, వామపక్షాలు ఒకరి రక్తపు దాహంతో అలమటిస్తున్నాయని, బెంగళూరులో మాత్రం రెండు పార్టీల నేతలు చేతులు పట్టుకుని నవ్వుతున్నారని అన్నారు. బెంగాల్‌లో కాంగ్రెస్, వామపక్ష కార్యకర్తలపై టిఎంసి ప్రజలు దాడులు చేస్తున్నారు. కానీ ఇక్కడ వారు ఏమీ అనడం లేదు. వారి నిజం ఇతర రాష్ట్రాలలో కూడా కనిపిస్తుంది. తమ కార్మికులను పట్టించుకోవడం లేదని అన్నారు ప్రధాని మోదీ

మనం మూడోసారి ఎన్నికవ్వడాన్ని దేశ ప్రజలు నిర్ణయించారని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ . అధికారం బలవంతంగా పొత్తు పెట్టుకున్నప్పుడు.. అవినీతి ధ్యేయంగా పొత్తు పెట్టుకున్నప్పుడు, కుటుంభం అనే విధానంతో పొత్తు పెట్టుకున్నప్పుడు, కులతత్వాన్ని, ప్రాంతీయతను దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నప్పుడు.. పొత్తు వల్ల దేశానికి చాలా నష్టం జరుగుతుందన్నారు ప్రధాని మోదీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం