రోజూ ప్రియుడ్ని కలుసుకునేందుకు.. ప్రియురాలు చేసిన వింత పని.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
బిహార్‌లోని బేతియా జిల్లా నౌతన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తన ప్రియుడ్ని కలిసేందుకు రాత్రిపూట కరెంట్ ఆపేస్తోందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే బెట్టియా అనే గ్రామానికి చెందిన ఓ యువతి ఓ అబ్బాయిని ప్రేమించింది.

బిహార్‌లోని బేతియా జిల్లా నౌతన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తన ప్రియుడ్ని కలిసేందుకు రాత్రిపూట కరెంట్ ఆపేస్తోందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే బెట్టియా అనే గ్రామానికి చెందిన ఓ యువతి ఓ అబ్బాయిని ప్రేమించింది. అయితే వాళ్ల గ్రామంలో తన ప్రియుడ్ని రాత్రిపూట కలుసుకునేందుకు ఆమె ఇబ్బందులు పడేది. రాత్రిపూట నిరంతరాయంగా వాళ్ల గ్రామంలో కరెంట్ ఉండటంతో అతడ్ని కలుసుకునేందుకు వీలు పడేది కాదు. ఎలాగైనా తన ప్రియుడ్ని కలుసుకోవాలని అనుకున్న ఆ యువతి చివరికి ఓ విచిత్రమైన ప్లాన్ చేసింది. తన గ్రామంలో ప్రతిరోజూ ట్రాన్స్‌ఫార్మర్ దగ్గిరికి వెళ్లి కరెంట్ వైర్లు తీసేసేది. దీంతో ఊరంతా చికటవ్వడంతో తన ప్రియుడ్ని రహస్యంగా వెళ్లి కలుసుకునేది.
అయితే ఇలా రోజూ రాత్రి కరెంట్ పోవడంతో స్థానికులు విసిగెత్తిపోయారు. అసలు కరెంట్ ఎందుకు పోతుంది అన్న కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ఓ రోజు ఆ యువతి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పవర్ కట్ చేయడాన్ని స్థానికులు గమనించి ఆమెను పట్టుకున్నారు. అలాగే ఆమె ప్రియుడ్ని కూడా పట్టుకుని చితకబాదారు. ఇలా ప్రతిరోజూ గ్రామంలో కరెంట్ పోవడం దొంగతనాలు కూడా జరుగుతున్నాయని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రెండు బైక్‌లు, చాలా వరకు మేకలు అపహరణకు గురయ్యాయని వాపోయారు. అలాగే ఆ ప్రేమికుల కథ అందరికి తెలిసిపోయింది. చివరికి పోలీసుల సమక్షంలో ఇరువురి కుటుంబ సభ్యులు వారి పెళ్లికి కూడా అంగీకరించంతో ఈ ప్రేమ కథ సుఖాంతమయ్యింది.








