Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్లో ఎప్పుడూ మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి.
Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్లో ఎప్పుడూ మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. ఒక్కోసారి పసిడి, వెండి ధరలు తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బుధవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) పసిడి ధర 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర 60,100 ఉంది. తులం బంగారంపై 120 మేర ధర పెరిగింది. ఇదిలాఉంటే.. కేజీ వెండి ధర రూ.300 మేర పెరిగి 78,000 రూపాయలకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,130 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.60,130 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.55.100, 24 క్యారెట్లు రూ.60,100 గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,500, 24 క్యారెట్లు 60,550 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55.100, 24 క్యారెట్లు రూ.60,100 గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55.100 ఉంటే.. 24 క్యారెట్లు రూ.60,100 గా ఉంది.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,000 గా ఉంది. ముంబైలో రూ.78,000, చెన్నైలో రూ.81,400, బెంగళూరులో రూ.77250 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.81,400 లుగా ఉంది.
గమనిక.. ఈ ధరలు బుధవారం ఉదయం వరకు నమోదైనవి.. కాగా.. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..