AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాబోయే భర్తతో పార్కుకు వెళ్లిన మహిళ.. కోరిక తీర్చాలంటూ వేధించిన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లినటువంటి ఓ మహిళను పోలీసులు లైంగికంగా వేధించడం కలకలం రేపుతోంది. తమ కోరిక తీర్చాలంటూ ఆ పోలీసులు ఆమె పట్ల ప్రవర్తించిన అసభ్యకరమైన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అంతేరాదు వారి నుంచి భారీగా డబ్బులను కూడా డిమాండ్‌ చేశారు. చివరకు1000 రూపాయలను బలవంతంగా పేటీఎం ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

కాబోయే భర్తతో పార్కుకు వెళ్లిన మహిళ.. కోరిక తీర్చాలంటూ వేధించిన పోలీసులు
Crime
Aravind B
|

Updated on: Oct 01, 2023 | 5:06 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లినటువంటి ఓ మహిళను పోలీసులు లైంగికంగా వేధించడం కలకలం రేపుతోంది. తమ కోరిక తీర్చాలంటూ ఆ పోలీసులు ఆమె పట్ల ప్రవర్తించిన అసభ్యకరమైన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అంతేరాదు వారి నుంచి భారీగా డబ్బులను కూడా డిమాండ్‌ చేశారు. చివరకు1000 రూపాయలను బలవంతంగా పేటీఎం ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే సెప్టెంబర్‌ 13న నోయిడాకు చెందిన 22 ఏళ్ల మహిళ, 23 ఏళ్ల కాబోయే భర్తతో కలిసి ఘజియాబాద్‌లోని సాయి ఉపవన్‌ పార్క్‌‌కు వెళ్లింది. అయితే పోలీస్ రెస్పాన్స్ వాహనంలో విధులు నిర్వహించే ముగ్గురు పోలీసులు అక్కడికి వచ్చారు. ఆ జంటను వేధించారు. అంతేకాదు.. ఆ మహిళ కాబోయే భర్తను చెంపపై కొట్టారు.

తమ కోరిక తీర్చాలంటూ ఆ మహిళను పోలీస్ కానిస్టేబుల్ అయిన రాకేష్ కుమార్ బలవంతం చేశాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ జంటను విడిచిపెట్టాలంటే ఒక పోలీస్ పదివేలు అడగ్గా.. మరో పోలీస్ ఏకంగా 5 లక్షల 5 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అయితే ఈ జంటను దాదాపు మూడు గంటల పాటు వాళ్లు వేధించారు. అయితే చివరకు ఆ మహిళ తన మొబైల్‌లోని పేటీఎం యాప్ నుంచి వెయ్యి రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించున్నారు. ఆ తర్వాత వాళ్లని విడిచిపెట్టారు. అయినా కూడా పోలీసులు మళ్లీ అంతటితో ఆగలేదు. ఆ తర్వాత కూడా ఆ మహిళను వేధింపులకు గురి చేశారు. సెప్టెంబర్ 19వ తేదీన రాకేష్ కుమార్ ఆమెకు ఫోన్ చేశాడు. తన కోరిక తీర్చాలంటూ చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. అయితే ఇందుకు సంబంధించిన కాల్‌నను ఆమె రికార్డు చేసింది. అంతటితో ఆగకుండా ఆ పోలీసులు సెప్టెంబర్ 22వ తేదీన ఆ పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు.

అక్కడ పోలీసులు చేసిన వేధింపులకు ఆ మహిళ ఎంతగానో విసిగిపోయింది. ఆ తర్వాత అత్యవసర నెంబర్‌కు కాల్ చేసి తన జరిగిన విషయాన్ని అధికారులకు చెప్పింది. ఇక ఆ మహిళ గురించి తెలుసుకున్నటువంటి ఘజియాబాద్ పోలీసులు ఆ ఘటనపై విచారణ చేపట్టారు. అలాగే ఆ మహిళను లైంగికంగా వేధించినటువంటి పోలీసులపై పలు సెక్షన్ల కింద సెప్టెంబర్ 28వ తేదీన కేసును నమోదు చేశారు. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి కానిస్టేబుల్‌ రాకేష్ కుమార్, హోంగార్డు దిగంబర్ కుమార్‌ కోసం ఘజియాబాద్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ రాకేష్ కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అలాగే హోంగార్డుపై చర్యలు తీసుకునేందుకు ఆ విభాగానికి కూడా లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ప్రజలను ముఖ్యంగా మహిళలను కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడటమేంటని స్థానికులు ఆ పోలీసుల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.