Rajnath Singh: అలా చేస్తేనే అభివృద్ధి చెందిన భారత్ అవుతుంది.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల కేంద్రప్రభుత్వం 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పుడు తాజాగా.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించబడాలంటే అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగి ఉన్నటువంటి బలమైన సాయుధ బలగాల అవసరముంటుందని పేర్కొన్నారు. అలాగే రక్షణ శాఖ అకౌంట్స్‌లోని విభాగంలో పలు డిజిటల్ సేవలను ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్.. త్రివిధ దళాలు తమకు అందుబాటులో ఉన్న ఆర్ధిక వనరులను ఉపయోగించుకుంటూ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండాలని పేర్కొన్నారు.

ఇటీవల కేంద్రప్రభుత్వం 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పుడు తాజాగా.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించబడాలంటే అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగి ఉన్నటువంటి బలమైన సాయుధ బలగాల అవసరముంటుందని పేర్కొన్నారు. అలాగే రక్షణ శాఖ అకౌంట్స్‌లోని విభాగంలో పలు డిజిటల్ సేవలను ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్.. త్రివిధ దళాలు తమకు అందుబాటులో ఉన్న ఆర్ధిక వనరులను ఉపయోగించుకుంటూ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండాలని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ సారాంశ్(రక్షా మంత్రాలయ అకౌంట్లు, బడ్జెట్, వ్యయం), బిశ్వాస్(బిల్లులు, పని విశ్లేషణ, ఈ-రక్షా ఆవాస్) అనే డిజిటల్ సేవలను ప్రారంభించారు.
అలాగే రక్షణ శాఖ అకౌంట్స్ విభాగమైన 276వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన రక్షణశాఖ అకౌంట్స్ విభాగం అనేది మొత్తం శాఖకే కవచంలా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అలాగే అంతర్గత నిఘా విభాగాన్ని కూడా మరింతగా బలోపేతం చేయడం వల్ల ఎక్కడైనా ఏదైన అనుమానాస్పద వ్యవహారాలు గనుక చోటుచేసుకున్నట్లైతే వాటి గురించి తెలుసుకునేందుకు వెంటనే గుర్తించే వీలు ఉటుందని పేర్కొన్నారు. అయితే దీనిద్వారా సమస్యను వెంటనే పరిష్కరించుకోవడమే కాకుండా.. ప్రజల్లో కూడా రక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని కూడా పెంచవచ్చని పేర్కొన్నారు. అలాగే మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే భారీ సాయుధ బలగాలకు ఆధునిక ఆయుధాలను అలాగే సామాగ్రిని అందించాల్సిన అవసరమం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అలాగే అందుకోసం మనవద్ద ఉన్నటువంటి ఆర్ధిక వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని సూచనలు చేశారు.
అలాగే ఇందుకోసం.. అవసరమున్న సేవలకు అందుబాటులో ఉన్నటువంటి వనరుల మధ్య బ్యాలన్స్ కుదరాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే ఎప్పటికప్పుడు కూడా మార్కెట్లోని ఆయుధాలపై అధ్యయనం చేసేందుకు అలాగే అకౌంట్స్ శాఖలో ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అయితే ఇంతకాలం డీఏడీ పారదర్శకమైన, సమర్ధవంతమైనటువంటి ఆర్దిక వ్యవస్థ వల్ల దేశ రక్షణ సామర్ధ్యాన్ని పెంచిన విధానం అద్భుతమని పేర్కొన్నారు. అలాగే ఏదైనా వ్యవస్థలో అకౌంటింగ్ అనేది చాలా ముఖ్యమైనదని రక్షణ అకౌంట్ విభాగం న్యాయబద్ధంగా అవసరాన్ని బట్టి వనరులను సమకూర్చుకోవాలాని పేర్కొన్నారు. అంతేకాదు వీలయినట్లైతే సాంకేతికంగా ముందడుగు వేసే విధంగా ఐఐఎం, ఐసీఏఐ లాంటి సంస్థలతో కూడా చేతులు కలపాలని ఆ తర్వాత డీఏడీ ఆర్ధిక మేధస్సు సైతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.