Khalistan: భారత హైకమిషనర్‌ను అడ్డుకున్న ఖలిస్థానీలు.. స్పందించిన గురుద్వారా
స్కాట్లాండ్‌లో తాజాగా భారత హైకమిషనర్‌ను ఖలిస్థానీ సానుభూతిపరులు అడ్డుకున్నారు. దీంతో ఈ సంఘటనపై గ్లాస్గో నగర గురుద్వారా తన స్పందనను తెలియజేసింది. అయితే అది పూర్తిగా క్రమశిక్షణారాహిత్య చర్య అంటూ పేర్కొంటూ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. మరోవైపు గురుద్వారా కూడా అందరి కోసం ఎప్పుడూ కూడా తెరిచే ఉంటుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. భారత రాయబారి వెళ్లిన అనంతరం కూడా ఖలిస్థానీ సానుభూతిపరులు గురుద్వారా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని తెలిపింది.

స్కాట్లాండ్‌లో తాజాగా భారత హైకమిషనర్‌ను ఖలిస్థానీ సానుభూతిపరులు అడ్డుకున్నారు. దీంతో ఈ సంఘటనపై గ్లాస్గో నగర గురుద్వారా తన స్పందనను తెలియజేసింది. అయితే అది పూర్తిగా క్రమశిక్షణారాహిత్య చర్య అంటూ పేర్కొంటూ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. మరోవైపు గురుద్వారా కూడా అందరి కోసం ఎప్పుడూ కూడా తెరిచే ఉంటుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. భారత రాయబారి వెళ్లిన అనంతరం కూడా ఖలిస్థానీ సానుభూతిపరులు గురుద్వారా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని తెలిపింది. ఇక వివరాల్లోకి వెళ్లినట్లైతే.. సెప్టెంబర్ 29వ తేదీన స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యుని ఆహ్వానం మేరకు గ్లాస్గో గురుద్వారా సందర్శనకు భారత హైకమిషనర్ వచ్చారు. కానీ అతడ్ని కొంతమంది వ్యక్తులు ఆయన్ని గురుద్వారాలోకి రానీయకుండా ఆపేశారు. దీనివల్ల ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దీంతో.. శాంతియుత వాతావరణానికి ఆటంకం కలిగించే విధంగా కొంతమంది ప్రవర్తించిన తీరును గురద్వారా తీవ్రంగా ఖండిస్తోంది. అయితే గురద్వారాకు ఎటువంటి పక్షపాతం అనేది లేదు. అలాగే అందరికోసం గురుద్వారా తలుపులు తెరుచుకోని ఉంటాయని ఒక ప్రకటనలో చెప్పింది. ఇక ఈ స్కాట్లాండ్ పర్యటనలో ఉన్నటువంటి భారత హై కమిషనర్ దొరైస్వామి ఆల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గో.. గురుద్వారా కమిటీ సభ్యులతో సమావేశమయ్యేందుకు శుక్రవారం రోజున అక్కడికి వెళ్లడం..అక్కడ ఖలిస్థాన్ మద్ధతుదారులు ఆయన కారును చుట్టుముట్టి అడ్డుకునే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అయితే వారిలో ఒకరు బలవంతగా కారు డోరు తెరవడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు ఈ ఘటనను వాళ్లే చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఇండియా తీవ్రంగా తన స్పందనను తెలియజేసింది. అలాగే దీన్ని ఓ అవమానరక చర్యగా భావించింది. అలాగే ఇందకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వానికి అధికారికంగా ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జూన్‌లో ఖలిస్థాని ఉగ్రవాది హర్‌దీప్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అతని హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉందని.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్‌లో ఆరోపణలు చేశారు. దీంతో ట్రూడో చేసిన ఆరోపణలపై భారత్ స్పందించింది. ఆయన చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని బదులిచ్చింది. దీంతో భారత్, కెనడాల మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ తరుణంలో ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. ఇరు దేశాల విదేశాంగ శాఖలు తమ పౌరులకు కీలక సూచనలను చేశాయి. అలాగే కెనడాలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని.. విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే మరోవైపు కెనడా కూడా అత్యవసరమైతేనే తప్ప ఇండియాలో పర్యటించకూడదని తమ దేశ పౌరులకు సలహాను జారీ చేసింది.