AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Durga Puja Pandal: దుర్గపూజా మండపంలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి, 64 మందికి గాయాలు

భదోహికి చెందిన ఔరాయ్ కొత్వాలికి సమీపంలో నార్తువాలో ఉన్న ఏక్తా దుర్గా పూజా పండల్‌లో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హారతి సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Durga Puja Pandal: దుర్గపూజా మండపంలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి, 64 మందికి గాయాలు
Duragpuja Pandal In Up
Surya Kala
|

Updated on: Oct 03, 2022 | 9:39 AM

Share

ఉత్తర్ ప్రదేశ్ లో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. దుర్గాపూజ పండల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం భదోహి దుర్గా పూజ చేస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 64 మంది గాయపడ్డారు. మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భ‌క్తులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ప్రాణాల దక్కించుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో మండపంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కొద్దిసేపటికే మండ‌పంలో భారీగా  మంట‌లు వ్యాపించాయి.

భదోహికి చెందిన ఔరాయ్ కొత్వాలికి సమీపంలో నార్తువాలో ఉన్న ఏక్తా దుర్గా పూజా పండల్‌లో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హారతి సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అంకుష్ సోని (12) అనే బాలుడు 10 ఏళ్ల బాలుడు, 45 ఏళ్ల మహిళ  మృతి చెందగా, 64 మందికి పైగా గాయపడినట్లు స‌మాచారం. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. క్షతగాత్రుల్లో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతున్నవారిలో 20మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలను డీఎంతోపాటు జిల్లాకు చెందిన ఇతర ఉన్నతాధికారులుపర్యవేక్షించారు. అగ్నిమాపక సిబ్బందికి మంటలను అదుపుచేయడానికి సుమారు గంట సమయం పట్టినట్లు తెలుస్తోంది. రాత్రి 9.30 గంటలకు అమ్మవారికి హారతి ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఘటన జరిగిన సమయంలో దాదాపు 300 మంది పండల్ లో ఉన్నారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగాయని భావిస్తున్నట్లు డీఎం చెప్పారు.

ఇవి కూడా చదవండి

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సీఎం యోగీ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య శాఖా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనపై దర్యాప్తుకి ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..