వలలు బరువుగా అనిపిస్తే పెద్ద చేపలు పడ్డాయని సంబరపడ్డారు.. కానీ అంతకుమించి.. ఏకంగా రూ.50 కోట్లు

ఈ తిమింగళం వాంతితో అరబ్ దేశాల్లో నాణ్యమైన పెర్ఫ్యూమ్‌లు తయారు చేస్తారు. చైనాలో ఆంబర్‌గ్రిస్‌తో లైంగిక సామర్ధ్యాన్ని పెంపొందించే టానిక్‌లు తయారు చేస్తారు.

వలలు బరువుగా అనిపిస్తే పెద్ద చేపలు పడ్డాయని సంబరపడ్డారు.. కానీ అంతకుమించి.. ఏకంగా రూ.50 కోట్లు
Whale Vomit
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 03, 2022 | 10:41 AM

వేటకు వెళ్లిన ప్రతిసారీ జాలర్లు గంగమ్మకు మొక్కుకుంటారు. ఎక్కువ చేపల్ని లేదా బాగా విలువ చేసే జలపుష్పాలు చిక్కాలని కోరకుంటారు. ఆ గంగమ్మ దయతో.. మెడిసిన్ కోసం ఉపమోగించే అరుదైన చేప చిక్కింది అనుకోండి పండగే. లేదంటే.. రోజు కూలి మందం అయినా ఎన్నో కొన్ని చేపలు అయినా పడతాయి. అయితే తమిళనాడులోని జాలర్లను మాత్రం అరుదైన అదృష్టం వరించింది. చెంగల్పట్టు జిల్లా కల్పాక్కం సమీపంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలల్లో ఏకంగా రూ.50 కోట్ల విలువైన అంబర్‌ గ్రిస్‌(తిమింగలం వాంతి) చిక్కింది. తొలుత వల భారీగా ఉండటంతో.. పెద్ద పెద్ద చేపల చిక్కాయేమో అనుకున్నారు. తీరా ఒడ్డుకు తీసుకొచ్చి చూడగా తిమింగళం వాంతిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే వారు దురాశకు పోయి దాన్ని అమ్ముకోడానికి ప్రయత్నంచలేదు. నిజాయితీగా వ్యవహరించి అచ్చిరుపాక్కం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులకు అప్పగించారు. మొత్తం 38.6 కిలోల అంబర్‌ గ్రిస్‌ చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తిమింగలం వాంతి దొరికిన విషయాన్ని చెప్పిన జాలర్లు ఇంద్రకుమార్‌, కర్ణన్‌, మాయకృష్ణన్‌, శేఖర్‌‌లను అధికారులు ప్రశంసించారు.

వాంతికి ఎందుకు అంత రేటు…

స్పెర్మ్ తిమింగలాలు చేసుకునే వాంతిని అంబర్‌ గ్రిస్‌ అంటారు. విలువ కారణంగా.. దీన్ని ఫ్లోటింగ్ గోల్డ్ అంటారు. స్పెర్మ్ వేల్స్ జీర్ణవ్యవస్థలో ఇది తయారవుతుంది.  వేటాడినప్పుడు స్పెర్మ్ వేల్స్.. ఒక ప్రత్యేకమైన పదార్థాల్ని విడుదల చేస్తాయి. ఈ పదార్థాలు స్పెర్మ్‌ వేల్ శరీరానికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఆ తర్వాత వేల్స్ శరీరంలోని వ్యర్ధాలను వాంతి  చేస్తాయి. ఇది నీటిపై తేలుతుంది.  సూర్యరశ్మి, ఉప్పు నీరు కలయికతో అంబర్ గ్రీస్‌గా మారుతుంది. ఈ అంబెర్‌గ్రిస్ తొలుత దుర్వాసన కలిగివుంటుంది. కాలం గడుస్తున్నకొద్దీ దాని సువాసన నెక్ట్స్ లెవల్‌కి చేరుతుంది. అంబర్‌ గ్రిస్‌ తెలుపు, నలుపు లేదా బూడిద రంగు కలిసిన నూనె పదార్థంలా ఉంటుంది. గుడ్డు ఆకారంలో లేదా, గుండ్రంగా ఉంటుంది. ఇది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ తిమింగళం వాంతిని పెర్ఫ్యూమ్స్, సెంట్స్‌లో వాడతారు. సాంప్రదాయ ఔషధాలలో సైతం వినియోగిస్తారు.

స్పెర్మ్‌ వేల్స్‌  సంరక్షించాల్సిన జీవుల జాబితాలో ఉన్నాయి. వాటిని వేటాడటం గాని, వాటికి సంబంధించిన పదార్థాలతో వ్యాపారం చేయడం చట్టపరంగా నేరం. ఆంబర్‌గ్రిస్‌ పేరుతో కొంతమంది మోసగాళ్లు కొవ్వు పదార్ధాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం

ఇప్పుడు ఈ స్టార్ హీరోలకు.. ఏపీ ప్రభుత్వమే దిక్కా
ఇప్పుడు ఈ స్టార్ హీరోలకు.. ఏపీ ప్రభుత్వమే దిక్కా
CM చేస్తానంటూ ఓ పార్టీ ఆఫరిచ్చింది.. ఒక్క మాటతో షాకిచ్చిన సోనూ
CM చేస్తానంటూ ఓ పార్టీ ఆఫరిచ్చింది.. ఒక్క మాటతో షాకిచ్చిన సోనూ
దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ గల్లంతయ్యే ఛాన్స్‌
దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ గల్లంతయ్యే ఛాన్స్‌
బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.