School kids: స్వాతంత్యం వచ్చి 75ఏళ్ళు.. నేటికీ ఆ గ్రామంలోని పిల్లలు చదువుకోవాలంటే .. ప్రాణాలను పణంగా పెట్టి నదిని ఈదాల్సిందే
పిల్లలు చదువుకోవడానికి గ్రామం నుండి 3 కి.మీ దూరంలో ఉన్న రాజగిరిలోని ప్రాథమిక పాఠశాలకు వెళతారు. గ్రామం .. పాఠశాల మధ్య ఒక చిన్న నది ఉందని.. దీనిని దాటడానికి వంతెన లేదు..
ఆ గ్రామంలోని చిన్నారులు చదుకోవాలంటే ప్రాణాలతో చెలగాటం ఆడాల్సిందే.. స్కూల్ బ్యాగులు తడవకుండా తలపై పెట్టుకుని.. మెడ లోతు నీటిలో నదిని ఈదుకుంటూ.. తమ గ్రామం నుండి స్కూల్ కు చేరుకోవాల్సిందే.. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా.. కనీస సదుపాయాలు లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. తాజాగా కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఝాన్సీలోని తెహ్రౌలీ తహసీల్ ప్రాంతంలోని రాజ్‌గిరి గ్రామంలోని పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు రోజూ ఇబ్బందులు పడుతున్నారు. పీకల్లోతు నీటిలో నడుస్తూ.. ఒడ్డుకు చేరుకున్న తర్వాత విద్యార్థులు ముందుగా తమ బట్టలు ఆరబెట్టుకునేందుకు ఎక్కడైనా ఆగి.. బట్టలు ఆరిన తర్వాత పాఠశాలకు వెళతారని చెబుతున్నారు. పిల్లలు చదువుకోవడానికి గ్రామం నుండి 3 కి.మీ దూరంలో ఉన్న రాజగిరిలోని ప్రాథమిక పాఠశాలకు వెళతారు.
గ్రామం .. పాఠశాల మధ్య ఒక చిన్న నది ఉందని.. దీనిని దాటడానికి వంతెన లేదు.. పాఠశాలకు చేరుకోవడానికి వేరే మార్గం లేదని గ్రామస్తులు చెబుతారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు స్కూల్‌లో చదువుకోవాలంటే నదిలోకి దిగి వెళ్లాల్సిందేనని అంటున్నారు. అందుకనే కొంచెం పెద్ద పిల్లలు స్కూల్ బ్యాగ్‌ని తలపై పెట్టుకుని నదిని దాటతారు. నది దాటుతున్న సమయంలో పిల్లలు పూర్తిగా తడిసిపోతారు. పాఠశాలకు వెళ్లే ముందు ఎండలో నిలబడి బట్టలు ఆరబెట్టుకుంటారు.
వర్షాకాలంలో నది ఉధృతంగా ప్రవహిస్తుందని స్థానిక గ్రామపెద్దలు చెబుతున్నారు. దీంతో పాఠశాల విద్యార్థులు నదిని ఈదుకుంటూ పాఠశాలకు చేరుకోవాల్సి వస్తోంది. నది ప్రవాహం అధికంగా ఉండే సమయంలో విద్యార్థులు చదువుకునేందుకు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు. ఈ విషయమై గ్రామపెద్దలు, పాఠశాల సిబ్బందితో పాటు గ్రామస్తులు పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ నేటికీ . కానీ పాఠశాలకు చేరుకోవడానికి సరైన ఏర్పాట్లు నేటికీ జరగలేదని వాపోతున్నారు స్టూడెంట్స్ తల్లిదండ్రులు. తమ పిల్లల భద్రత కోసం నది దాటడానికి.. వారి తల్లిదండ్రులు నదికి ఇరువైపులా కావాలా ఉంటారు. తద్వారా తమ పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చుకుంటారు. అయితే ఒకొక్కసారి నది దాటే సమయంలో తల్లిదండ్రుల తో పాటు.. పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నదని వాపోతున్నారు.
झांसी का यह वीडियो बहुत ही डरावनी है। अगर इस दौरान बच्चे के साथ कोई दुर्घटना हे जाए तो इसका ज़िम्मेदार कौन होगा। pic.twitter.com/4fwz0rl09u
— priya singh (@priyarajputlive) October 2, 2022
సమస్య పరిష్కారం కోసం డిఎమ్ హామీ ఈ విషయంపై ఝాన్సీ జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ స్పందిస్తూ.. గ్రామస్థుల సమస్య తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం అధికారులతో మాట్లాడి నదిపై వంతెన నిర్మాణానికి ప్రాధమిక అంచనా వేసినట్లు చెప్పారు. నిర్మాణం పీడబ్ల్యూ శాఖ చేపట్టనున్నదని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..