‘సార్.. ఎలుక కనిపించట్లేదు కాస్త వెతికి పెట్టరూ’.. పోలీస్ స్టేషన్ కు చేరిన వింత కేసు

ఇంట్లో డబ్బులు, నగలు, విలువైన వస్తువులు పోయాయని కంప్లైంట్ ఇవ్వడం కామన్. కానీ ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు కనిపించకుండా పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం వెరైటీ. ప్రస్తుతం..

'సార్.. ఎలుక కనిపించట్లేదు కాస్త వెతికి పెట్టరూ'.. పోలీస్ స్టేషన్ కు చేరిన వింత కేసు
Rat Missing
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 03, 2022 | 10:40 AM

ఇంట్లో డబ్బులు, నగలు, విలువైన వస్తువులు పోయాయని కంప్లైంట్ ఇవ్వడం కామన్. కానీ ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు కనిపించకుండా పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం వెరైటీ. ప్రస్తుతం చాలా మంది ఇంట్లో తమతో పాటు పెట్స్ ను పెంచుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాటిని సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటూ మురిసిపోతుంటారు. వారు ఎక్కడికి వెళ్లినా.. వెంట తీసుకెళ్లడం, వాటి అవసరాలు తీర్చడం, పనులు నేర్పించడం వంటివి చేస్తుంటారు. అవి కనిపించకుడా పోతే తెగ బాధపడిపోతుంటారు. తాజాగా రాజస్థాన్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఎంతో ప్రేమగా పెంచుకునే ఎలుక కనిపింకకుండా పోయిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా ఎత్తుకెళ్లినవారు కూడా తెలుసునని అనుమానం వ్యక్తం చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన అరుదైన ఫిర్యాదు చూసి జనం నవ్వుకుంటుంటే, కోడిపుంజు దొంగను ఎలా పట్టుకోవాలో తెలీక పోలీసులు తికమక పడిపోతున్నారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని సజ్జన్‌గఢ్‌ ప్రాంతంలోని పడ్లా వాఢ్కియా గ్రామంలో ఓ వ్యక్తి నివాముంటున్నాడు. అతను కొన్నాళ్లుగా ఎలుకను పెంచుకుంటున్నాడు. ఓ రోజు రాత్రి నిద్రపోయి ఉదయం లేచిన తర్వాత అతనికి తన పెంపుడు ఎలుక కనిపించలేదు. ఎలుక ఆచూకీ గురించి వెతికారు. గ్రామంలో ఉన్నవారందరినీ అడిగాడు. అయినా ఎలుక దొరకలేదు. ఇలా అయితే పని అవదని భావించి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అతని ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు. తన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఎలుక కనిపించకుండా పోయిందని, దాని బరువు 700 గ్రాములు ఉంటుందని ఆనవాళ్లు చెప్పాడు. తన సోదరుడి ముగ్గురు కుమారులపైనే అనుమానం ఉందని, వారు ఎలుకను కిడ్నాప్ చేశారని పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై చివరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ముగ్గురి పేర్లను యాడ్ చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఇలాంటి ఫిర్యాదు అందడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు.. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పోలీస్ స్టేషన్లో అరుదైన ఫిర్యాదు నమోదైంది. వాల్మీకిపురం మండలంలోని పెద్ద వంక పల్లెకు చెందిన వెంకటాద్రి కోడిపుంజు చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాదిన్నర క్రితం తమిళనాడు రాష్ట్రం, సేలం నుంచి జాతి పుంజులను తెచ్చుకొని పెంచుతున్నాడు. పెద్దవంక గ్రామ పరిసరాల్లో తరచూ కోడిపందాలు జరుగుతుంటాయని, పందాల కోసమే దొంగలు అపహరించి వెళ్లారని అనుమానం వ్యక్తం చేశాడు. వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్ఐ బిందు మాధవి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో