AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Couple Tips: సారీ చెప్పేయండి డ్యూడ్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.. అంతే ప్రాబ్లమ్ సాల్వ్..

భార్యాభర్తల మధ్య కోపతాపాలు, అలకలు సర్వ సాధారణం. సాధారణంగా మనం జీవితంలో చాలా మందితో పరిచయాలు ఉంటాయి. తెలిసో తెలియకో మన ప్రవర్తన వల్ల ఎదుటివారి మనోభావాలు దెబ్బతింటాయి. ఇతరులపై...

Couple Tips: సారీ చెప్పేయండి డ్యూడ్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.. అంతే ప్రాబ్లమ్ సాల్వ్..
Couple
Ganesh Mudavath
|

Updated on: Oct 03, 2022 | 7:17 AM

Share

భార్యాభర్తల మధ్య కోపతాపాలు, అలకలు సర్వ సాధారణం. సాధారణంగా మనం జీవితంలో చాలా మందితో పరిచయాలు ఉంటాయి. తెలిసో తెలియకో మన ప్రవర్తన వల్ల ఎదుటివారి మనోభావాలు దెబ్బతింటాయి. ఇతరులపై కోప్పడటం, బాధపెట్టడం వంటివి మన ప్రమేయం లేకుండానే జరుగుతుంటాయి. ఇది జీవితంలో కామన్ అయినప్పటికీ దానిని సరిదిద్దుకోవడం అనేది మన ప్రవర్తనను చూపుతుంది. అలాంటిది కడ దాకా మనతో కలిసి జీవించేందుకు సిద్ధమైన భాగస్వామి విషయంలో ఎంత జాగ్రత్తగా, ప్రేమగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి త‌ర్వాత చాలా ఏళ్ల జీవితం మిగిలి ఉంటుంది. వివాహం తరువాత ఎలా స్థిర పడాలి అనే విషయంలో ముందుగానే ప్లాన్ వేసుకోవాలి. వీటిలో వచ్చే మార్పుల కారణంగా భార్యా భ‌ర్తలు, చిన్న చిన్న కార‌ణాల తో గొడ‌వ‌లు ప‌డుతున్నారు. ఆ కార‌ణాల‌తో విడాకులు తీసుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇక కొంత మంది ఎన్ని గొడ‌వ‌లు జ‌రిగినా జీవితాంతం విడిపోకుండా క‌లిసి ఉంటున్నారు. కోపం వచ్చినా వెంటనే సరిదిద్దుకునేలా, పరిస్థితులకు తగ్గట్టు సర్దుకోవడం వంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి.

దంపతుల మధ్య అహానికి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది తీవ్ర విపరిణామాలను తీసుకొస్తుంది. భార్యా భర్తల మధ్య గొడవ వచ్చి, మనస్పర్థలు వస్తాయి. కాసేపటికి కోపం తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేశాం అనేది ఆలోచించుకోవాలి. ప్రేమగా సారీ చెప్పాలి. దంపతుల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు ఇది సరైన పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు. మనం అహాన్ని అధిగమించినప్పుడే నిజమైన భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవచ్చని సూచిస్తున్నారు. మన వల్ల ఎవరైనా హర్ట్ అయితే అవతలి వ్యక్తి వైపు ఆలోచించాలి. అప్పుడే మనం చేసింది రైటా రాంగా అనే విషయం అర్థమవుతుంది. మన వల్ల వేరొకరు హర్ట్ అయ్యారని, వారు మనల్ని హర్ట్ చేస్తే మన రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది ఆలోచించుకోవాలి.

ప్రవర్తననూ మార్చుకోవడం నేర్చుకోవాలి. ఇది క్షమాపణ కంటే గొప్పదేం కానప్పటికీ సారీ చెప్పాల్సిన అవసరం రాకుండా చేస్తుందని చెప్పవచ్చు. వారిని బాధపెట్టిన తర్వాత కమ్యూనికేట్ చేయడానికి అవతలి వ్యక్తి మనతో మాట్లాడడానికి ఆసక్తి చూపించకపోవచ్చు. అలాంటి వారితో చనువుగా మాట్లాడి, వారి ఆలోచనలు, భావాలను అర్ధం చేసుకుని తెలుసుకోవాలి. వారికి అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా చూసుకునేలా ప్రవర్తించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి