Bharat Jodo Yatra: వర్షంలోనూ ఆగని రాహుల్ గాంధీ ప్రసంగం.. ఆయన అడుగు జాడల్లో నడవడం వారికి కష్టమంటూ చురకలు..

దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్7వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర తమిళనాడు, కేరళలో..

Bharat Jodo Yatra: వర్షంలోనూ ఆగని రాహుల్ గాంధీ ప్రసంగం.. ఆయన అడుగు జాడల్లో నడవడం వారికి కష్టమంటూ చురకలు..
Rahul Gandhi
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 02, 2022 | 10:31 PM

దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్7వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర తమిళనాడు, కేరళలో పూర్తిచేసుకుని ఇటీవల కర్ణాటకలోకి ప్రవేశించింది. అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి నేపథ్యంలో ఆయన కర్ణాటకలోని మైసూరులో భారత్ జోడో యాత్ర నిర్వహించారు. భారీగా వచ్చిన జనసందోహం మధ్య ఆయన పాదయాత్రను కొనసాగించారు. అలాగే యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఈ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు భారీ వర్షం కురిసింది. అయినా సరే రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. జోరగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. వర్షంలోనే పార్టీలో చేరికల ప్రక్రియ, నేతలంతా కలిసి అభివాదం చేయడం వంటివి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

తాను పోస్టు చేసిన వీడియోకు భారత్‌ను ఐక్యం చేయడంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు. దేశ గొంతుకను వినిపించే విషయంలో ఎవరూ ఆపలేరు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగే భారత్‌ జోడో యాత్రనూ ఎవరూ ఆపలేరంటూ క్యాప్షన్‌ పెట్టారు.

ఇవి కూడా చదవండి

ఇలా ఉండగా..  మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అంతకుముందు ఖాదీ గ్రామోదయ కేంద్రంలో మహాత్మా గాంధీకి రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. గాంధీ సిద్ధాంతాలను వల్లించడం కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి సులభంగానే ఉంటుంది కానీ, ఆయన అడుగు జాడల్లో నడవడం మాత్రం వాళ్లకు కష్టమంటూ బీజేపీని ఉద్దేశించి విమర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..