AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. కటాఫ్ మార్కులు తగ్గింపు.. ఎవరెవరికి ఎంతంటే..

తెలంగాణలో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కటాఫ్‌ మార్కులు తగ్గిస్తూ నోటిఫికేషన్ విడుదల అయింది. ముఖ్యంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు..

Telangana: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. కటాఫ్ మార్కులు తగ్గింపు.. ఎవరెవరికి ఎంతంటే..
Ts Police Constable Exam
Ganesh Mudavath
|

Updated on: Oct 03, 2022 | 8:08 AM

Share

తెలంగాణలో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కటాఫ్‌ మార్కులు తగ్గిస్తూ నోటిఫికేషన్ విడుదల అయింది. ముఖ్యంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు ఆదివారం సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 30% మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హత సాధిస్తారని ప్రకటించింది. గత నియామకాల సమయంలో జనరల్‌ కేటగిరీకి 40%, బీసీ అభ్యర్థులకు 35%, ఎస్సీలకు30% కటాఫ్‌గా మార్కులుగా నిర్ధరించారు. ఈసారి జనరల్‌ కేటగిరీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీలకు సైతం 30% మార్కులను కటాఫ్‌గా ఫైనలైజ్ చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో కటాఫ్‌ తగ్గిస్తూ కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. జనరల్‌ కేటగిరీకి కటాఫ్‌ మార్కులు 10% తగ్గడంతో మిగతా కేటగిరీలకూ కటాఫ్‌ తగ్గిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.

తాజా నోటిఫికేషన్ ప్రకారం బీసీ అభ్యర్థులకు 25%, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ కేటగిరీకి 20% మార్కులు కటాఫ్‌గా ఖరారు చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచినట్లు బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులు.. వివరాలను అప్‌లోడ్‌ చేసేందుకు ఈనెల 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8 వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఆగస్టు 28న నిర్వహించిన తెలంగాణ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ రాత పరీక్ష కు 6,03,955 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ మేరకు ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు తన అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. కాగా 15,644 సివిల్‌ పోస్టులతోపాటు, 63 ట్రాన్స్‌పోర్ట్‌, 614 కానిస్టేబుల్‌ పోస్టులకు ఈ యేడాది ఏప్రిల్‌ 28న వేర్వేరుగా విడుదలైన నోటిఫికేషన్లను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఉమ్మడిగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 6,61,198 మంది దరఖాస్తు చేసుకోగా.. 6,03,955 మంది హాజరయ్యారు. దాదాపు 91.34శాతం మంది పరీక్ష రాశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..