ఇప్పటికే 4 పెళ్లిళ్లు, 11 మంది సంతానం, 40 మంది మనవళ్లు.. అయినా మళ్లీ పెళ్లి..

నిత్య పెళ్లి కొడుకుల గురించి వినే ఉంటాం. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేయడం వంటివి మనకు తెలిసిందే. కానీ ఇక్కడ జరిగిన ఓ పెళ్లి మాత్రం అందరి దృష్టి ఆకర్షించింది. అది కూడా..

ఇప్పటికే 4 పెళ్లిళ్లు, 11 మంది సంతానం, 40 మంది మనవళ్లు.. అయినా మళ్లీ పెళ్లి..
Marriage In Sixty Years
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 03, 2022 | 11:00 AM

నిత్య పెళ్లి కొడుకుల గురించి వినే ఉంటాం. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేయడం వంటివి మనకు తెలిసిందే. కానీ ఇక్కడ జరిగిన ఓ పెళ్లి మాత్రం అందరి దృష్టి ఆకర్షించింది. అది కూడా ఆయన చేసుకుంది 60 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి. ఇప్పటికే ఆయన కుటుంబసభ్యుల సంఖ్య 62. అయితే ఆయన పెళ్లికి కుటుంబసభ్యులు బలవంతం చేయడం విశేషం. పాకిస్థాన్ కు చెందిన షాకత్ ఇంట్లో కామన్ డైలాగ్ ఏంటో తెలుసా? తాతయ్య పెళ్లి- జరగాలి మళ్లీ మళ్లీ. అదేంటి అంటారా? అదంతే.. గతేడాదే ఫ్రెష్ గా ఐదో పెళ్లి చేసుకున్నారు షాకత్. కొందరు మోసగాళ్లను నిత్య పెళ్లి కొడుకు అని అంటుంటారు. కానీ ఈయన మాత్రం ఎప్పుడూ కొత్త పెళ్లి కొడుకే. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగినా ఆయనకింకా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మాత్రం తీరలేదు.

ఇప్పటికే పదకొండు మందది పిల్లలు. వీరిలో 10 మంది అమ్మాయిలు కాగా.. ఒకే ఒక్క అబ్బాయి. వీరందరి పిల్లలతో కలిపి మొత్తంంగా ఈ కుటుంబ సభ్యుల సంఖ్య అక్షరాలా అరవై రెండు. తన ఐదో పెళ్లికి ముందే తన ఎనిమిది మంది ఆడపిల్లలకు ఒకే ఒక్క కొడుక్కి పెళ్లి చేశారు షాకత్. అయితే మిగిలిన ఇద్దరు పెళ్లికాని అమ్మాయిలు. తమ తండ్రి ఒంటరిగా ఉండకూడదని, పెళ్లి చేసుకుని సుఖంగా జీవించాలని పట్టుపట్టారు. షాకత్ తన ఇద్దరు కూతుళ్లకు పోయినేడాది పెళ్లి చేశారు. అదే సమయంలో తాను కూడా ఐదో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చారు.

ఇంత వయసున్న తాతయ్యను పెళ్లాడ్డం మీకెలా ఉంది అని అడిగితే ఆమె ఆనందానికి అవథులు లేకుండా పోయాయి. ఇంత పెద్ద కుటుంబంలో తాను కూడా ఒక సభ్యురాలిని కావడం గొప్పగా ఉందని అంటారామె. అయితే.. ఈ మతాచారంలో బహుభార్యత్వం, బహుళ వివాహాలకు అనుమతి ఉంది. కానీ అదేం తప్పని సరి కాదు. ఈ విషయం షాకత్ కి కూడా బాగా తెలుసు. కానీ పరిస్థితులు అలా కలిసొచ్చాయని అంటారాయన. మొదటి నాలుగు పెళ్లిళ్లు ఎలా జరిగినా, ఐదో పెళ్లి మాత్రం తన చిన్న కూతుళ్ల ప్రోద్బలంతో చేసుకున్నానని ఆయన చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి