AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mulayam Singh Yadav: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌ పై చికిత్స

ములాయం సింగ్ పరిస్థితిని తెలుసుకునేందుకు ఇరువురు నేతలు అఖిలేష్ యాదవ్‌కు ఫోన్ చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా తాము చేయడానికి  సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీ అఖిలేష్ కు ఫోన్‌లో తెలిపారు.

Mulayam Singh Yadav: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌ పై చికిత్స
Mulayam Singh Yadav
Surya Kala
|

Updated on: Oct 03, 2022 | 7:32 AM

Share

సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం ఆదివారం మరింత విషమించింది. వెంటనే అతడిని గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలోని ఐసీయూకి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్ కూడా మేదాంతకు చేరుకున్నారు. మేదాంతలో శివపాల్, ప్రతీక్, అపర్ణ కూడా ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఆకాంక్షించారు. ములాయం సింగ్ పరిస్థితిని తెలుసుకునేందుకు ఇరువురు నేతలు అఖిలేష్ యాదవ్‌కు ఫోన్ చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా తాము చేయడానికి  సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీ అఖిలేష్ కు ఫోన్‌లో తెలిపారు.

ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యంపై సమాజ్ వాదీ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. నేతాజీని గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లోని ఐసీయూలో ఉంచారని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో, మేదాంత ఆసుపత్రి PRO కూడా ఒక ప్రకటన విడుదల చేసి ములాయం సింగ్ ఆరోగ్యం గురించి తెలియజేశారు. యూరిన్ ఇన్ఫెక్షన్ తో పాటు రక్తపోటు సమస్య బాగా పెరగడంతో ములాయం సింగ్ అడ్మిట్ అయ్యారని తెలిపారు. ఆదివారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఐసీయూకి తరలించారు. పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో వైద్యులు వెంటిలేటర్‌ సపోర్ట్‌పై ఉంచారు. మేదాంత హాస్పిటల్ ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయడం లేదు. మొత్తం సమాచారాన్ని అఖిలేష్ యాదవ్‌కు అందించినట్లు తెలుస్తోంది.

చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం

ఇవి కూడా చదవండి

ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ములాయం సింగ్ యాదవ్ చాలా కాలంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ములాయం సింగ్ యాదవ్‌కు పొత్తికడుపు నొప్పి , యూరినరీ ఇన్‌ఫెక్షన్ ఇబ్బందులున్నాయి. ఆరోగ్యం మెరుగవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆయన మరోసారి అదే సమస్యతో ఆసుపత్రిలో చేరారు.

ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం ఇంతకు ముందు చాలాసార్లు క్షీణించింది.  గతేడాది జులై 1న కూడా ఆయన మేదాంత ఆసుపత్రిలో చేరారు.  అప్పుడు కూడా  ఐసీయూలో ఉంచి చికిత్సనందించారు. ఇటీవల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. జూలై నెలలో, కరోనాతో భార్య సాధన గుప్తా మరణించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..