AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Presidential Poll: ఇవాళ హైదరాబాద్‌లో శశిథరూర్‌ క్యాంపెయిన్‌.. కాంగ్రెస్‌ బలోపేతం కోసమే పోటీ అన్న ఎంపీ..

తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త సంకటం మొదలైంది. పార్టీ అధ్యక్ష అభ్యర్ధి.. హైదరాబాద్‌ పర్యటన పార్టీలో కాక రేపుతోంది. ప్రచారంలో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన థరూర్‌కు రాష్ట్ర నేతలు కనీసం స్వాగతం కూడా పలకలేదు. కానీ ఇవాళ ఆయన ఎవరిని కలుస్తారు? ఆయనకు ఎవరు మద్ధతు ఇస్తారనేది హస్తం పార్టీ నేతలకే అర్ధం కాని పరిస్థితి?

Congress Presidential Poll: ఇవాళ హైదరాబాద్‌లో శశిథరూర్‌ క్యాంపెయిన్‌.. కాంగ్రెస్‌ బలోపేతం కోసమే పోటీ అన్న ఎంపీ..
Shashi Tharur
Sanjay Kasula
|

Updated on: Oct 03, 2022 | 7:24 AM

Share

కాంగ్రెస్.. సుదీర్ఘ చరిత్ర పార్టీ. ఎన్నో ఏళ్లు దేశాన్ని ఏలిన పార్టీ. స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా.. ఎంతో ప్రత్యేకమైనది. కానీ ఈ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నేతల తీరు చూస్తుంటే.. ఇవేం పాలిటిక్స్ అనేలా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. శశిథరూర్, ఖర్గే మధ్య పోటీ జరుగుతోంది. ఇద్దరూ గాంధీయేతర కుటుంబానికి చెందిన నేతలే.. సో.. ఎలక్షన్ రోజు, ఎవరో ఒకరికి ఓటేయడం, ఆ తర్వాత ఫలితాల్లో ఒకరు అధ్యక్షులు కావడం కామనే.. ఈ ప్రాసెస్ అంతా సాఫీగా జరిగితే అది కాంగ్రెస్ ఎందుకు అవుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అనిపించుకోదేమో.. అందుకే, అందరూ హస్తం పార్టీలో పరిణామాలు మరోసారి చర్చకు వచ్చాయి.

ప్రచారంలో భాగంగా అధ్యక్ష అభ్యర్ధుల్లో ఒకరైనా శశిథరూర్.. హైదరాబాద్ చేరుకున్నారు. కానీ ఆయనకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యనేతలు ఒక్కరంటే, ఒక్కరు కూడా వెళ్లలేదు. సొంత పార్టీకి చెందిన ఎంపీ, అధ్యక్ష బరిలో నిలిచిన వ్యక్తి వస్తే ఇలా ప్రవర్తిండం పట్ల పార్టీ కార్యకర్తల్లోనే తీవ్ర చర్చ జరుగుతోంది.

మల్లిఖార్జున్ ఖర్గేకు తెలంగాణ కాంగ్రెస్ మద్ధతు ప్రకటించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. ఎవరికి ఓటేస్తారనేది తర్వాత సంగతి. పార్టీకి చెందిన నేత వచ్చినప్పుడు కనీసం రిసీవ్ చేసుకోవాలి కదా. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఆయనను రిసీవ్ చేసుకోవడానికి పేరున్న నేతలెవరూ రాలేదు. తాను మాత్రం కాంగ్రెస్ బలోపేతానికే ఎన్నికల బరిలో నిలిచాననీ.. పార్టీ నేతలందరినీ కలుస్తానంటున్నారు. ప్రచారంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్టు తెలిపారాయన.

గతంలో రేవంత్ రెడ్డి, శశిథరూర్ మధ్య వివాదం నడిచింది. థరూర్‌ను ఉద్ధేశిస్తూ.. గాడిద అంటూ రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఆ తర్వాత ఆయన స్ట్రాంగ్‌గా రియాక్ట్ కావడంతో రేవంత్ క్షమాపణ కోరారు. ఇప్పుడు రిసీవ్ చేసుకోకపోవడానికి ఇదే కారణమా?

ఇక్కడే ఇంకో డౌట్ కూడా కొడుతోంది. ఖర్గేకు సోనియా గాంధీ కుటుంబం అండదండలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనకు దేశవ్యాప్తంగా మెజార్టీ నేతలు మద్ధతు ఇస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కూడా అదే తోవలో నడుస్తోంది. ఈ రీజన్‌తోనే శశిథరూర్ పర్యటనను నిర్లక్ష్యం చేసిందా? అనేది ఆ పార్టీ నేతలకే తెలియాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం