Bathukamma: పూలపండుగలో చివరి రోజు సద్దుల బతుకమ్మకు వేళాయే.. నేడు గంగమ్మ ఒడికి చేరనున్న బతుకమ్మ

సద్దుల బతుకమ్మ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు సాగిన ఆటా పాటలతో పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్నాయన్నారు.

Bathukamma: పూలపండుగలో చివరి రోజు సద్దుల బతుకమ్మకు వేళాయే.. నేడు గంగమ్మ ఒడికి చేరనున్న బతుకమ్మ
Batukamma
Follow us

|

Updated on: Oct 03, 2022 | 6:06 AM

బతుకమ్మ వేడుకల్లో చివరి ఘట్టం సద్దుల బతుకమ్మకు వేళయింది. విచ్చుకున్న పూలన్నీ బతుకమ్మ మెచ్చుకోలుకై ఎదురుచూస్తున్నాయి. ఎంగిలపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు ఇవాళ సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. అటు సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు సద్దుల బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

బతుకమ్మ.. ఓ సంబురం.. సంతోషం. తెలంగాణ సగటు ఆడపడుచుకు ఇంతకంటే పెద్ద పండగ ఏదీ లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను దేవతగా కొలిచే అరుదైన పండుగ ఇది. తీరొక్క పూలను తెచ్చి.. అందంగా పేర్చి.. ఎంతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మను గంగమ్మ ఒడికి సాగనంపుతారు.

బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. తెలంగాణలో ఇప్పుడు ఏ మూలన విన్నా.. ఇదే పాట వినిపిస్తోంది. బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మకు ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఆడపడుచులు 8రోజుల పాటు భక్తి, శ్రద్ధలతో ప్రకృతి పూలతో…ఆటపాటలతో జరుపుకుంటారు. అలాంటి పూలపండుగలో చివరి రోజునే సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ఊరు, వాడ, పట్టణం తేడా లేకుండా వేలాది మంది ఆడపడుచులు ఒక్కచోట చేరి సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు సద్దుల బతుకమ్మ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు సాగిన ఆటా పాటలతో పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్నాయన్నారు. ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా దీవించాలని మరోసారి అమ్మవారిని ప్రార్ధించారు ముఖ్యమంత్రి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!