AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Jodo Yatra: తనయుడికి అండగా రంగంలోకి తల్లి.. ఈనెల 6వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా

నదిలా సాగే ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగుతుందని కాంగ్రెస్ నేత తెలిపారు. ఈ ప్రయాణం ఎండలు, తుఫాను, వర్షాలు, వరదలు, చలి ఇలాంటి వీవీ ఆపలేవని స్పష్టం చేశారు

Bharat Jodo Yatra: తనయుడికి అండగా రంగంలోకి తల్లి.. ఈనెల 6వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా
Bharat Jodo Yatra
Surya Kala
|

Updated on: Oct 02, 2022 | 8:17 PM

Share

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అక్టోబర్ 6న కర్ణాటకలో జరిగే ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొననున్నారు.  ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు ఓ ప్రకటన వెలువరించారు. అయితే తన తనయుడికి సంఘీభావం తెలుపుతూ సోనియా గాంధీ ఒంటరిగా యాత్రలో పాల్గొంటారా లేదా ఆమె కుమార్తె..  కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా తన తల్లితో కలిసి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’కు హాజరవుతారా అనేది స్పష్టంగా తెలియలేదు. రాహుల్ గాంధీ కర్ణాటకలో 511 కి.మీ ప్రయాణించనున్నారు. సోనియా గాంధీ ఇలా ఓ యాత్రలో పాల్గొనడం ఇదే తొలిసారి.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మెడికల్ చెకప్ కోసం విదేశాలకు వెళ్లారు. ఈ యాత్ర భాగంగా రాహుల్ గాంధీ వివిధ గ్రామాలను సందర్శిస్తూ.. ప్రజల కష్టాల గురించి తెలుసుకుంటున్నారు. రాహుల్ యాత్ర సెప్టెంబర్ 30న తమిళనాడులోని గుడ్లూరు నుంచి కర్ణాటకలోని గుండ్లుపేటకు చేరుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రంలోకి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యాత్రకు కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు  బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇలాంటి యాత్ర జరగడం ఇదే తొలిసారి.

కర్ణాటకలో ప్రయాణంలో 3వ రోజు కర్ణాటకలో మూడో రోజు యాత్ర  సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వ్యాప్తి చేస్తున్న విద్వేషాలకు వ్యతిరేకంగా నిలవడమే భారత్ జోడో యాత్ర లక్ష్యమని అన్నారు. తన ప్రయాణం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగుతుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని, ఈరోజు కురుస్తున్న వర్షం కూడా మనల్ని ఆపలేకపోయిందని అన్నారు. నదిలా సాగే ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగుతుందని కాంగ్రెస్ నేత తెలిపారు. ఈ ప్రయాణం ఎండలు, తుఫాను, వర్షాలు, వరదలు, చలి ఇలాంటి వీవీ ఆపలేవని స్పష్టం చేశారు. తమ యాత్రలో మీకు ద్వేషం లేదా హింస కనిపించదు, ప్రేమ, సోదరభావం మాత్రమే కనిపిస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

బొమ్మై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన రాహుల్  కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా అంటూ రాహుల్ గాంధీ..  బీజేపీ,  కర్ణాటక ముఖ్యమంత్రి అవినీతి రికార్డులను వెల్లడించారు. ప్రతిదానికీ 40 శాతం కమీషన్ తీసుకుంటారు. కాంట్రాక్టర్‌ అసోసియేషన్‌ ప్రధానమంత్రికి లేఖ రాసి 40శాతం కమీషన్‌ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసినా ప్రధాని ఏమీ చేయలేదన్నారు. కర్ణాటకలోని 13,000 పాఠశాలల సంఘాలు తాము కూడా ప్రభుత్వానికి 40 శాతం కమీషన్ చెల్లించాలని చెప్పాయని, అయితే ఈ విషయంలో ప్రధాని కానీ, ముఖ్యమంత్రి కానీ చర్యలు తీసుకోలేదని రాహుల్ అన్నారు.

సెప్టెంబర్ 7 నుంచి ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభం: డీమోనిటైజేషన్, జీఎస్టీ తో చిన్న వ్యాపారుల వెన్నెముక విరిగిపోయాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఎంపిక చేసిన 2-3 మంది పారిశ్రామికవేత్తలు మొత్తం పూర్తి ప్రయోజనం పొందుతున్నారు. రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో యాత్ర కాశ్మీర్‌లో ముగుస్తుంది. ఈ ప్రయాణం మొత్తం 3570 కి.మీ సాగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..