Kolkata Durga Puja: దుర్గపూజ మండపంలో జాతిపిత బాపూజీకి అవమానం.. దుశ్చర్య అంటూ మండిపడుతున్న రాజకీయ నేతలు
గాంధీ విగ్రహాన్ని మార్చాలని లేదా విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని నిర్వాహకులను పోలీసులు కోరారు. అలాంటి విగ్రహం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే కోల్‌కతాలోని రూబీ మోర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఓ మండపంలోని విగ్రహం విషయంలో వివాదం నెలకొంది. అఖిల భారత హిందూ మహాసభ ఏర్పాటు చేసిన దుర్గాపూజ పండల్‌లో మహాత్మా గాంధీని మహిషాసురునిగా ప్రదర్శించడంపై దుమారం రేగింది. మహాత్మా గాంధీని అసురునిగా చూపించిన విషయం తెలియగానే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పూజ మండపం వద్దకు హడావిడిగా చేరుకుంది. విగ్రహాన్ని మార్చాలని లేదా విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని ఆదేశాలను జారీ చేసింది. పోలీసులు, పరిపాలన అధికారుల ఒత్తిడితోనే పూజ నిర్వాహకులు గాంధీ వేషంలో తయారు చేసిన విగ్రహాన్ని మార్చవలసి వచ్చిందని తెలుస్తోంది. అదే విగ్రహానికి మహిషాసురుడి రూపాన్ని ఇచ్చారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.
ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా అఖిల భారత హిందూ మహాసభ నిర్వహించిన దుర్గాపూజలో గాంధీని మహిషాసురునిగా చూపించినట్లు టీవీ 9 హిందీలో వార్తలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ వార్త ప్రచురితం కావడంతో పోలీసులు, అధికారులు రంగంలోకి దిగారు. గాంధీని రాక్షసుడు అని పిలిచిన తర్వాత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.. విగ్రహాన్ని మార్చింది.

Kolkata Durga Puja
అధికారుల ఒత్తిడితో విగ్రహాన్ని మార్చారు.




ఆదివారం సాయంత్రం అఖిల భారత హిందూ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా వేదిక వద్దకు పోలీసులు, పరిపాలన అధికారులు చేరుకుని మహాత్మాగాంధీ విగ్రహాన్ని మహిషాసురునిగా చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహాన్ని మార్చాలని లేదా విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని నిర్వాహకులను పోలీసులు కోరారు. అలాంటి విగ్రహం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఇదే విషయంపై పోలీసులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం నిర్వాహకులు గాంధీ విగ్రహం బదులు మహిషాసురుడిని ఏర్పాటు చేశారు. గాంధీజీ రాక్షసుడు కాదని.. ఎటువంటి హానికరమైన పనులు చేయలేదని, ఆయనకు గౌరవం ఇవ్వాలని కొందరు చెప్పారు. అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని అఖిల భారత హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ యూనిట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూడ్ గోస్వామి అన్నారు.
గాంధీ జీని అసుర రూపంలో చూపించడంపై రాజకీయ వివాదం తలెత్తింది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ ఘాటుగా స్పందించారు. అసభ్యత హద్దు మీరిపోయిందని అన్నారు. దీంతో బీజేపీ అసలు ముఖం బట్టబయలైంది. ఇది డ్రామా. మహాత్మాగాంధీ జాతిపిత అని, ఆయన భావజాలాన్ని ప్రపంచం మొత్తం గౌరవిస్తోందన్నారు. జాతిపితను ఏ రూపంలో అవమానించినా సహించబోమన్నారు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ బెంగాల్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ సుకాంత మజుందార్ కూడా ఇది సరైన చర్య కాదన్నారు.. తమ పార్టీ ఈ చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది దురదృష్టకరం, అగౌరవ చర్య అంటూ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..