Iranian Passenger Jet: చైనా వెళ్తున్న ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు.. రంగంలోకి భారత సుఖోయ్ ఫైటర్ జెట్లు..
ఇరాన్ ప్రయాణీకుల విమానం భారత గగనతలం గుండా వెళుతుండగా దానికి బాంబు బెదిరింపు వచ్చింది. లాహోర్ విమానాశ్రయం ఏటీసీ విమానంలో బాంబు ఉన్నట్లు పేర్కొంది. అదే సమయంలో..

ఇరాన్ నుంచి చైనా వెళ్తున్న ఓ ప్యాసింజర్ విమానంలో బాంబు ఉన్నట్లు హెచ్చరిక.. కలకలం రేపింది. ఇరాన్ ప్రయాణీకుల విమానం భారత గగనతలం గుండా వెళుతుండగా దానికి బాంబు బెదిరింపు వచ్చింది. లాహోర్ విమానాశ్రయం ఏటీసీ విమానంలో బాంబు ఉన్నట్లు పేర్కొంది. అదే సమయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు భారత్ అనుమతి ఇవ్వలేదు. వెంటనే భారత వాయుసేన రంగంలోకి దిగింది. వాయుసేన ఫైటర్ జెట్లు.. ఆ పాసింజర్ విమానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ విమానం చైనా దిశగా సాగుతోంది.
ఆ తర్వాత ఢిల్లీ విమానాశ్రయం నుండి జైపూర్ విమానాశ్రయానికి సమాచారం అందించబడింది. ఆ తర్వాత భారీ ఏజెన్సీలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం భద్రతా సంస్థలు ఆ విమానం కదలికల్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విమానం భారత్ నుంచి అనుమతి కోరిందని, అధికారులు అనుమతించలేదని తెలుస్తోంది. విమానం ఢిల్లీ, జైపూర్‌లో ల్యాండ్ కావాలనుకున్నా వాటికి అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ విమానం చైనా వైపు కదులుతోంది.
ఇరాన్ విమానాన్ని వెంటాడుతున్న సుఖోయ్ విమానాలు..
ఈ విమానం మహాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఈ విమానం భారత వైమానిక దళం పరిధి నుంచి బయటకు వెళ్లి ఉంటుందని స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. బాంబు గురించి అధికారిక ధృవీకరణ లేదని సమాచారం. విమానం సంఖ్య W581. అదే సమయంలో బాంబు వార్త తర్వాత భారత వైమానిక దళం యాక్షన్ మోడ్‌లోకి వచ్చింది.
#WATCH | A lone Sukhoi jet was seen over Jodhpur IAF airbase before LCH induction ceremony began & ahead of the arrival of Defence Minister Rajnath Singh. Earlier today, Sukhoi jets were scrambled to address an aerial emergency with an Iranian passenger jet. pic.twitter.com/DBzqrorinW
— ANI (@ANI) October 3, 2022
భారత వైమానికి స్థావరం నుంచి సుఖోయ్ విమానాలు ఆ ఇరాన్ విమానాన్ని వెంటాడుతున్నాయి. దీని ఉద్దేశ్యం ఏంటంటే.. సుఖోయ్ ఈ ఇరాన్ విమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రించవచ్చు. భారత వైమానిక దళం దానిని పరిధి నుంచి బయటకు తీసుకెళ్లవచ్చని తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని భారత భారత భద్రతా సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం