AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique School: ఈ బాలిక సంస్కృత పాఠశాల వెరీ వెరీ స్పెషల్.. ఇంటి పేర్లు ఉండవు.. సంస్కృతం, ఇంగ్లీష్-హిందీ భాషలపై డిమాండ్.. ఎక్కడంటే

వాస్తవానికి, పాఠశాలలో ఇంటిపేరు ఉపయోగించకపోవడానికి కారణం ఆధ్యాత్మికతకు సంబంధించినది. ప్రతి అమ్మాయికి తనదైన వ్యక్తిత్వం ఉంటుందని పాఠశాల నమ్ముతుంది. ఆడపిల్లలను శక్తి స్వరూపంగా భావించి పూజించినట్లు పురాణాల కథనం.

Unique School: ఈ బాలిక సంస్కృత పాఠశాల వెరీ వెరీ స్పెషల్.. ఇంటి పేర్లు ఉండవు.. సంస్కృతం, ఇంగ్లీష్-హిందీ భాషలపై డిమాండ్.. ఎక్కడంటే
Girls Sanskrit Vidyalaya
Surya Kala
|

Updated on: Oct 03, 2022 | 10:47 AM

Share

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ బాలికల పాఠశాల ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఈ గర్ల్స్ స్కూల్ లో ఉన్న నిబంధనల కారణంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ పాఠశాల్లో చదివే బాలికల పేర్లకు ముందు ఇంటి పేరు రాయరు. చదువుకునే అమ్మాయి పేరు ఉంటె చాలు.. ఆమె పేరుకు ఒక ప్రత్యేకమైన పదం జోడించబడుతుంది.  ఈ పాఠశాలలో చదువుకునే అమ్మాయిలను శక్తి స్వరూపంగా భావిస్తారు. నవరాత్రి పండుగ సందర్భంగా.. ప్రతిరోజూ ఇక్కడ పూజలు జరుగుతాయి.. మొత్తం పాఠశాల ఆవరణలో భక్తి భావనతో నిండి ఉంటుంది.

అయితే..  పాఠశాలలో నింపాల్సిన పరీక్ష ఫారమ్‌లు, పత్రాలపై మాత్రం ఇంటిపేరు ఉపయోగిస్తారు. అయితే ఎప్పుడూ విద్యార్థినిని ఇంటిపేరుతో పిలవరు. ఈ పాఠశాల పేరు గార్గి ప్రభుత్వ నివాస ఆదర్శ్ కన్యా సంస్కృత విద్యాలయం. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని బర్ఖేడి ప్రాంతంలో ఉంది. ఈ పాఠశాలలో 210 మంది బాలికలు చదువుతున్నారు.

ఇంటిపేరు ఎందుకు ఉపయోగించరంటే.. వాస్తవానికి, పాఠశాలలో ఇంటిపేరు ఉపయోగించకపోవడానికి కారణం ఆధ్యాత్మికతకు సంబంధించినది. ప్రతి అమ్మాయికి తనదైన వ్యక్తిత్వం ఉంటుందని పాఠశాల నమ్ముతుంది. ఆడపిల్లలను శక్తి స్వరూపంగా భావించి పూజించినట్లు పురాణాల కథనం.. అమ్మాయి అయినా తమకు తామే ఒక శక్తి.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో ఒకే పేరుతో ఇద్దరు అమ్మాయిలు స్కూల్ లో ఉంటే.. ఆ బాలికలిద్దరికీ సంస్కృతంలో ప్రత్యేకమైన పేరు పెడతారు.  ఇలా చేయడం వల్ల ఎలాంటి గందరగోళ పరిస్థితి తలెత్తదు.

సంస్కృతం కాకుండా, ఇంగ్లీష్-హిందీపై కూడా అమ్మాయిలకు కమాండ్ పాఠశాల డైరెక్టర్ పీఆర్ తివారీ మాట్లాడుతూ సంస్కృతాన్ని వేదాలు, పురాణాలు, బ్రాహ్మణుల ఆధిపత్య భాషగా చూస్తున్నారన్నారు. సంస్కృతంపై పురుషుల ఆధిపత్యాన్ని ఛేదించాలని తమ పాఠశాల విశ్వసిస్తోంది. అన్ని తరగతుల్లోనూ బాలికలు తమ పాఠశాలలో చదువుతున్నారని తెలిపారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సంస్కృతంతో పాటు ఇంగ్లీషు, హిందీ కూడా బాగా మాట్లాడతారు.

మరిన్నికెరీర్ & ఉద్యోగాలు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..