DCIL Recruitment: చివరి అవకాశం.. విశాటపట్నం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ దరఖాస్తులకు నేటితో ముగుస్తోన్న గడువు..
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. విశాటపట్నంలో ఉన్న ఈ కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థలో పలు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు...
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. విశాటపట్నంలో ఉన్న ఈ కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థలో పలు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (సోమవారం)తో ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో డ్రెడ్జ్ క్యాడెట్లు (15), ట్రైనీ మెరైన్ ఇంజినీర్లు (15), ఎన్సీవీ(ట్రైనీస్) (జీపీ రేటింగ్) (15) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి పదోతరగతి, ప్రీ-సీ జీపీ రేటింగ్ కోర్సు, నాటికల్ సైన్స్‌లో డిప్లొమా, మెరైన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 30-11-2022 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు డ్రెడ్జ్ క్యాడెట్లకు రూ.15000, ట్రైనీ మెరైన్ ఇంజినీర్లకు రూ.25000, ఎన్సీవీ(ట్రైనీస్)కు రూ.10,000 చెల్లిస్తారు.
* ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (03-10-2022) ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..