Koh-i-Noor: కోహినూర్ వజ్రానికి చివరి వారసుడైన సిక్కు యువరాజు నుంచి.. బ్రిటిష్ రాజుల వద్దకు ఎలా చేరుకుందో తెలుసా!..

ముస్సోరీ వాసులకు కోహినూర్ వజ్రానికి ఉన్న బంధం గురించి గుర్తు చేసుకుంటున్నారు. పంజాబ్‌ చివరి సిక్కు పాలకుడైన దులీప్ సింగ్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రానికి వారసుడు.

Koh-i-Noor: కోహినూర్ వజ్రానికి చివరి వారసుడైన సిక్కు యువరాజు నుంచి.. బ్రిటిష్ రాజుల వద్దకు ఎలా చేరుకుందో తెలుసా!..
Koh I Noor
Follow us
Surya Kala

|

Updated on: Sep 20, 2022 | 2:31 PM

Koh-i-Noor: భారత దేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు మాత్రమే కాదు.. ఒకానొకప్పుడు అత్యంత ధనిక దేశం కూడా.. మన దేశ సంపదను దోచుకోవడానికి విదేశీయులు అనేక దాడులు చేశారు. దురాక్రమణలు చేసినట్లు చరిత్ర ద్వారా వెల్లడవుతున్న చేదులాంటి నిజం. వజ్రం అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కోహినూర్ వజ్రం. మన దేశంలో పుట్టి బ్రిటన్ దేశ మహారాణి రాణి కిరీటాన్ని అలంకరించింది. ఇప్పుడు క్వీన్ ఎలిజబెత్ II మరణించడంతో మళ్ళీ ఈ వజ్రం వార్తల్లో నిలిచింది. మన దేశ సంపదను మనకు ఇవ్వమని భారతీయులు గొంతెత్తి చాటుతున్నారు. ఇప్పుడు ఎలిజబెత్ II  మరణం తర్వాత ముస్సోరీ నివాసితులకు పట్టణానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

క్వీన్ భార్య కెమిల్లా వారసత్వంగా కోహినూర్ వజ్రం క్వీన్ ఎలిజబెత్ II దగ్గరకు చేరుకుంది. ముస్సోరీ వాసులకు కోహినూర్ వజ్రానికి ఉన్న బంధం గురించి గుర్తు చేసుకుంటున్నారు. పంజాబ్‌ చివరి సిక్కు పాలకుడైన దులీప్ సింగ్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రానికి వారసుడు. దులీప్ సింగ్‌ ను  చిన్న వయస్సులోనే ఇంగ్లండ్‌ తీసుకుని వెళ్లారు. అయితే అంతకు ముందు దులీప్ సింగ్‌ ను బ్రిటిష్ వారు విద్య కోసం ముస్సోరీ పట్టణంలో ఉంచినట్లు చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది.

“సిక్కు యువ రాజు దులీప్ సింగ్‌ ను 1854లో ఇంగ్లండ్‌కు తీసుకువెళ్లడానికి రెండేళ్ల ముందు.. అంటే 1852లో ముస్సోరీకి తీసుకుని వెళ్లి రెండు సంవత్సరాలు ఇక్కడ ఉంచారు. బార్లోగంజ్‌లోని వైట్‌బ్యాంక్ కోటలో ఉండి విద్యను అభ్యసించాడు. కాలక్రమంలో ఈ కోటను కూల్చి.. ఫైవ్ స్టార్ హోటల్‌ ను నిర్మించారని స్థానిక చరిత్రకారుడు గోపాల్ భరద్వాజ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

యువ రాజు దులీప్ సింగ్‌ ను ఆర్మీ సర్జన్  డాక్టర్ జాన్ లాగిన్, అతని భార్య లీనా లాగిన్‌ల సంరక్షణలో ఉంచినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. యువ యువరాజును ముస్సోరీ పట్టణానికి తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశ్యం అతన్ని పంజాబ్ కు దూరంగా ఉంచడంతో పాటు.. అతడిని ఇంగ్లాండ్‌కు తీసుకెళ్లే ముందు అతనిని తీర్చిదిద్దడం అని తెలుస్తోంది.

ముస్సోరీలో.. దులీప్ సింగ్‌ ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమైనా..  క్రికెట్‌పై అమితాసక్తిని కనబరిచాడు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సెయింట్ జార్జ్ కళాశాల మనోర్ హౌస్‌లో అప్పట్లో దులీప్ సింగ్‌  కోసం ప్రత్యేకంగా క్రికెట్ గ్రౌండ్‌ను తయారు చేశారు. తరువాత, 1854లో డల్హౌసీ సింగ్‌ను ఇంగ్లండ్‌కు తీసుకువెళ్లడానికి ఏర్పాటు చేశాడు. అక్కడ దులీప్ సింగ్‌ వజ్రాన్ని చూపించారు. అతడు వజ్రాన్ని పరిశీలించిన తర్వాత.. అతను విలువైన వజ్రాన్ని  విక్టోరియా రాణికి గిఫ్ట్ గా అందించాడని ముస్సోరీ ప్రజలు చెబుతుంటారు.

“ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న..  విలువైన కోహినూర్ వజ్రానికి వారసుడైన దులీప్ సింగ్..  ఆ వజ్రాన్ని బ్రిటిష్ రాజులకు అప్పగించడానికి అతని సంరక్షకుడు ఆర్మీ సర్జన్  డాక్టర్ జాన్ లాగిన్ ఎంతగానో కృషి చేసాడు. దీంతో డాక్టర్ లాగిన్‌కి రాణి నైట్‌హుడ్‌ను ప్రదానం చేసింది” అని ప్రముఖ రచయిత,  ముస్సోరీ నివాసి చెప్పారు.

అలా భారత్ నుంచి బ్రిటన్ కు చేరుకున్న కోహినూర్ వజ్రం.. బ్రిటిష్‌ రాజకుటుంబంలో ఒకటిగా అయింది. అప్పటి నుంచి కోహినూరు వజ్రం ఆ ఇంటి పెద్దకోడలికి వారసత్వ కానుకగా ఇస్తోంది. అయితే ఇప్పుడు క్వీన్ ఎలిజిబెత్ 11 మరణంతో మళ్ళీ మన కోహినూర్ మనకు తెప్పించండి అంటూ అడుగుతున్నారు. అవును ఎవరికైనా మనం బహుమతిగా ఇస్తే తిరిగి అడగకూడదు.. కానీ బలవంతంగా తీసుకున్నారు కనుక మన వజ్రం మాకు ఇవ్వమని అడిగే వారు కూడా ఉన్నారు. విశిష్టతను సొతం చేసుకున్న కోహినూర్ వజ్రాన్ని ఎప్పటికైనా మన పాలకులు తిరిగి తీసుకొస్తారేమో చూడాలి మరి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన