Viral Video: కూతురి కోసం కోతుల గుంపుతో యుద్ధం చేసిన జర్నలిస్ట్‌.. ఆఖరుకు ఏం జరిగిందంటే..

ఇప్పుడు అక్కడ కోతులు రెచ్చిపోతున్నాయి. మనుషులు తరచూ దాడి చేస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో నిజంగానే షాకింగ్ గా ఉంది.

Viral Video: కూతురి కోసం కోతుల గుంపుతో యుద్ధం చేసిన జర్నలిస్ట్‌.. ఆఖరుకు ఏం జరిగిందంటే..
Father Attacked Monkeys
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 19, 2022 | 7:31 PM

Viral Video: పల్లె, పట్నం తేడా లేదు.. ఎక్కడ చూసిన విచ్చలవిడిగా సంచరిస్తున్న మర్కట మూకలు ముప్పేట దాడి చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా దండెత్తివస్తున్న వానరాలు ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కోతుల బెడదతో ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. నియంత్రించేందుకు ప్రయత్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నాయి. కోతుల దాడుల్లో గాయపడున్న వారి సంఖ్య పెరుగుతోంది. అటు రైతులకు పంట నష్టం తప్పడం లేదు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కి చెందినదిగా తెలిసింది. ఇప్పుడు అక్కడ కోతులు రెచ్చిపోతున్నాయి. మనుషులు తరచూ దాడి చేస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో నిజంగానే షాకింగ్ గా ఉంది.

ఈ వీడియో ఒక జర్నలిస్టు ఇంటి బయటిది. ఈ వీడియోలో మీరు ఒక చిన్న సందును చూడవచ్చు. ఇందులో చాలా ఇళ్లు ఉన్నాయి.. కొన్ని నిర్మాణ సామాగ్రి కూడా కనిపిస్తుంది. సదరు జర్నలిస్టు కూతురిపై కోతులు దాడికి దిగాయి. కూతురి అరుపులు విని అతడు బయటకు వచ్చాడు. కూతురిని కాపాడి ఇంట్లోకి పంపించాడు. ఆ తర్వాత జరిగింది చూస్తే షాక్‌ అవుతారు. ఈ కోతులను తరిమికొట్టాలని చూశాడు.. సుమారు అరగంట పాటు ఆ కోతులను రాళ్లతో కొట్టాడు. వారి పోరాటం కొంత భయానకంగా ఉంది. అటు ఇటూ పరిగెడుతూ కోతులతో పెద్ద యుద్ధమే చేశాడు..కానీ, కోతులు చాలా తెలివైనంటారు కదా.. అవి తమ తెలివిని ప్రయోగించాయి. అతడు రాళ్ల కోసం కిందకు వంగిన వెంటనే ఓ కోతి అతని మేడపై దూకింది. దాంతో అతడు ఒక్కసారిగా బోర్లపడిపోయాడు. దాంతో అతడికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో కోతుల గుంపు బెదిరింపు పెరిగింది. అనేక మందిపై దాడి చేసి గాయపరిచాయి కూడా. నివాసా ప్రాంతాల నుండి ఈ కోతులను తరిమికొట్టాలని, ప్రజలు శాంతి భద్రతలతో జీవించడానికి వీలు కల్పించాలని కోరుతూ కోర్టులో కేసు కూడా దాఖలు చేయబడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే