Andhrapradesh: అయ్యో పాపం.. ఆడిటర్ గా పనిచేస్తున్న తండ్రి.. ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..

సత్యకుమార్ రాజమండ్రిలో ఆడిటర్ గా పని చేస్తున్నారు. వ్యాపారుల జీఎస్టీ బిల్స్ కి సంబంధించిన పనులు చూసేవారు. ఈ క్రమంలోనే సత్యకుమార్‌ సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Andhrapradesh: అయ్యో పాపం.. ఆడిటర్ గా పనిచేస్తున్న తండ్రి.. ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..
Rajahmundry Suicide
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 19, 2022 | 5:44 PM

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి రూరల్ రాజవోలులో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడు రాజమండ్రి- వీఎల్ పురానికి చెందిన సత్యకుమార్ గా గుర్తించారు పోలీసులు. సత్యకుమార్ రాజమండ్రిలో ఆడిటర్ గా పని చేస్తున్నారు. వ్యాపారుల జీఎస్టీ బిల్స్ కి సంబంధించిన పనులు చూసేవారు. ఈ క్రమంలోనే సత్యకుమార్‌, తన కుమార్తెలు రిషిత(12), హద్వి (7)లను చెరువులో పడవేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాలను బయటకు తీయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే, ఆత్మహత్యకు ముందు సత్యకుమార్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విపరీతమైన పని ఒత్తిడి, ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యకుగల కారణమని సత్యకుమార్ సూసైడ్ నోట్లు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అయితే పిల్లలు ఏ పాపం చేసినట్టు? వీరిద్దరినీ మొదట చెరువులోకి తోసి.. తాను ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు ఏమై ఉన్నాయా ? అనే కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి