Fire Accident: క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. బ్యాగుల దుకాణంలో ఒక్క‌సారిగా మంట‌లు

లెదర్ షాపులో మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే స్థానిక వ్యాపారులు పోలీసుల‌కు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు.

Fire Accident: క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. బ్యాగుల దుకాణంలో ఒక్క‌సారిగా మంట‌లు
Fire Accident
Follow us

|

Updated on: Sep 19, 2022 | 4:46 PM

Fire Accident: ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రం కోల్‌క‌తా న‌గ‌రానికి స‌మీపంలోని హౌరా మైదాన్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. హౌరాలోని ఓ క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌లోగ‌ల బ్యాగుల దుకాణంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. లెదర్ షాపులో మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే స్థానిక వ్యాపారులు పోలీసుల‌కు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. హటా హుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు. ఆరు ఫైరింజ‌న్‌ల సాయంతో మంట‌ల‌ను ఆర్పేశారు. కోల్‌క‌తా న‌గ‌ర స‌మీపంలోని హౌరా మైదాన్ ఏరియాలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంద‌ని అధికారులు తెలిపారు.

జరిగిన ప్రమాదంతో భారీగానే ఆస్తినష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. జరిగిన ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి