Viral Video: ప్రేమంటే ఏమిటి..? అసలైన అర్థం చెబుతున్న వృద్ధ దంపతులు.. తప్పక చూడాల్సిన వీడియో

ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి డాక్టర్ సుమితా మిశ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియో చూసిన ప్రజలు విపరీతంగా స్పందిస్తున్నారు.

Viral Video: ప్రేమంటే ఏమిటి..? అసలైన అర్థం చెబుతున్న వృద్ధ దంపతులు.. తప్పక చూడాల్సిన వీడియో
Old Couple
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 19, 2022 | 4:13 PM

Emotional video: ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ యుగం నడుస్తుంది. సోషల్ మీడియా ప్రభంజనంతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా క్షణాల్లోనే అది ప్రపంచం ముందు వాలిపోతుంది. ఇకపోతే ఏదేని ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగితే చాలు.. అది మరింతగా వైరల్ అవుతుంది. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాంటి వాటిని జనం ఎక్కువగా ఆదరిస్తుంటారు. తాజాగా ప్రేమకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ ట్రెండవుతోంది. సదరు వీడియోలో ఒక ఎనభై ఏళ్లకు పైబడిన వృద్ధ దంపతులు భోజనం చేస్తున సన్నివేశం.. ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి డాక్టర్ సుమితా మిశ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియో చూసిన ప్రజలు విపరీతంగా స్పందిస్తున్నారు.

ఐఏఎస్ అధికారిణి డాక్టర్ సుమితా మిశ్రా హర్యానా వ్యవసాయం, రైతుల సంక్షేమం అదనపు ప్రధాన కార్యదర్శి, హర్యానా కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. IAS డాక్టర్ సుమితా మిశ్రా తరచుగా ట్విట్టర్‌లో ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన వీడియోలను పంచుకుంటారు. ఈ క్రమంలోనే సుమితా మిశ్రా షేర్‌ చేసిన ఈ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది..

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో ఒక వృద్ధ దంపతుల మధ్య తరగని ప్రేమ, అప్యాయత కనిపిస్తుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వృద్ధదంపతులు నేలపై కూర్చుని ఆహారం తింటున్నారు. ఇందులో ఆ వృద్ధుడికి ఏ మాత్రం ఓపిక లేదు.. తన చేతులతో స్వయంగా ఆహారం కూడా తినలేకపోతున్నాడు..అందుకు ఆ వృద్ధురాలు తానే అతడికి ఆహారం తినిపిస్తుంది. ఈ వయసులో కూడా ఆ వృద్ధురాలు తన భర్తకోసం పడుతున్న తపన నెటిజన్లను కట్టిపడేసింది. ఆ ఇద్దరి మధ్య ప్రేమను చూడాల్సిందే.

కేవలం 15 సెకన్ల ఈ క్లిప్ ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఒకరోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియోను నెటిజన్లు దాదాపు 5 లక్షల సార్లు చూశారు. 31 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో ప్రజలు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇది కాకుండా వందలాది మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది కదా నిజమైన ప్రేమంటే అంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి