kerala :రాత్రికి రాత్రే మారిన తల రాత.. రిక్షా నడిపే వ్యక్తిని కరుణించిన లచ్చిందేవి రూ.25కోట్లు ఇచ్చింది..

తనకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పాడు. తాను ఇదంతా నిజమని నమ్మకలేకపోతున్నానంటూ సంతోషంగా చెబుతున్నాడు.

kerala :రాత్రికి రాత్రే మారిన తల రాత.. రిక్షా నడిపే వ్యక్తిని కరుణించిన లచ్చిందేవి రూ.25కోట్లు ఇచ్చింది..
lottery
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 18, 2022 | 9:24 PM

Onum Bumper Lottery : దేవుడి ఆశీస్సులు ఉండాలే గానీ, మట్టిని పట్టుకుంటే కూడా బంగారం అవుతుంది అంటారు.. కేరళకు చెందిన ఓ ఉదంతం ఈ సామెతను నిజం చేసింది. ఇక్కడ ఒక ఆటో రిక్షా డ్రైవర్‌కు 25 కోట్ల లాటరీ వచ్చింది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఓనం బంపర్ లాటరీ ఫలితాలను కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ ఆదివారం విడుదల చేసింది. ఈసారి ఓ ఆటోడ్రైవర్ ని అదృష్టం వరించింది. ఓనం బంపర్ లాటరీ ఫలితాల్లో తిరువనంతపురంలోని శ్రీవరాహం నివాసి అయిన 32 ఏళ్ల ఆటో డ్రైవర్ అనూప్ విజేతగా నిలిచాడు. లాటరీలో అతనికి రూ.25 కోట్లు గెల్చుకున్నాడు. కేరళ లాటరీ చరిత్రలో ఓనం బంపర్ లాటరీ అత్యధిక ప్రైజ్ మనీ ప్రకటించడం ఇదే తొలిసారి.

ఆదివారం మధ్యాహ్నాం 2 గంటలకు ఫలితాలను ప్రకటించారు. ఇందులో అనూప్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెంబర్ TJ750605కి ఫస్ట్ ఫ్రైజ్ లభించడంతో అతడి దానికి అవధుల్లేకుండా పోయాయి. తాను శనివారం రాత్రే టిక్కెట్ కొనుగోలు చేశానని, తనకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పాడు. తాను ఇదంతా నిజమని నమ్మకలేకపోతున్నానంటూ సంతోషంగా చెబుతున్నాడు. కాగా,కేరళ లాటరీ డిపార్ట్ మెంట్ 67.50లక్షల లాటరీ టిక్కెట్లను ప్రింట్ చేయగా శనివారం సాయంత్రం నాటికి మొత్తం 66.40 లక్షల టిక్కెట్లు అమ్ముడపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి