West Bengal: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. ఆగ్రహంతో బస్సుకు నిప్పుపెట్టిన గ్రామస్తులు.. ఉద్రిక్తత

మంటలను ఆర్పకుండా అగ్నిమాపక సిబ్బందిని కూడా ఆపారని పోలీసు అధికారి తెలిపారు. బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గంలో బస్సు సర్వీసులను 48 గంటలపాటు నిలిపివేసినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

West Bengal: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. ఆగ్రహంతో బస్సుకు నిప్పుపెట్టిన గ్రామస్తులు.. ఉద్రిక్తత
Bus Set Afire
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 18, 2022 | 9:00 PM

West Bengal:  ఉత్తర బెంగాల్‌లోని సిలిగురి పట్టణం సమీపంలోని జాతీయ రహదారి-31పై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్థానిక నివాసిపై నుంచి సిక్కిం రవాణా శాఖకు చెందిన బస్సు దూసుకెళ్లింది. దాంతో ఆగ్రహంచిన గ్రామస్తులు బస్సుకు నిప్పుపెట్టారు. సిలిగురి శివార్లలోని బెంగాల్ సఫారీ పార్క్ సమీపంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సచిన్ ఛెత్రిగా గుర్తించారు. అతను తన టూవీలర్‌పై సాలుగార నుండి సెవోకే వద్ద ఉన్న తన ఇంటికి తిరిగి వస్తుండగా మరో బస్సును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఎదురుగా వస్తున్న బస్సు అతనిని ఢీకొట్టింది. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడని, ఆ తర్వాత ఒక గుంపు బస్సుకు నిప్పంటించిందని చెప్పారు.

మంటలను ఆర్పకుండా అగ్నిమాపక సిబ్బందిని కూడా ఆపారని పోలీసు అధికారి తెలిపారు. బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గంలో బస్సు సర్వీసులను 48 గంటలపాటు నిలిపివేసినట్లు సిక్కిం ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి