Viral News: ప్రేమకు వయసుకు సంబంధం లేదు.. కానీ ఇది మరీ టూమచ్చ్.. 62ఏళ్ల వృద్ధుడి ప్రేమలో పడ్డ 18 ఏళ్ల యువతి

ఇప్పుడు నా జీవితంలోకి వచ్చి నా ఆసియా తన ఇంటిని, తన జీవితాన్ని సందడిగా మార్చేసిందంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌ అవుతోంది.

Viral News: ప్రేమకు వయసుకు సంబంధం లేదు.. కానీ ఇది మరీ టూమచ్చ్.. 62ఏళ్ల వృద్ధుడి ప్రేమలో పడ్డ 18 ఏళ్ల యువతి
Girl Fall In Love
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 18, 2022 | 7:09 PM

Viral News: 62 ఏళ్ల వృద్ధుడికి మనసిచ్చిన ఓ యువతి..అతన్నే పెళ్లి చేసుకుంది. పైగా వారి వైవాహిక జీవితం ఎంతో హ్యాపీగా ఉందంటూ ఆ జంట సంతోషంగా చెబుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వారి ప్రేమకథ వైరల్‌ అవుతోంది. ఇది తెలిసి నెటిజన్స్ కూడా షాకవుతున్నారు. వృద్ధుడిపై ప్రేమ గురించి ఆ అమ్మాయి చెప్పిన కారణం వింటే ఎవరికైనా మనసు చలించిపోతుంది. ఈ షాకింగ్ వీడియోను ఇప్పటి వరకు మిలియన్ల మంది వీక్షించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు దీనిపై స్పందించారు. ఈ విచిత్ర ప్రేమపెళ్లికి కారణం ఏంటని ప్రశ్నించగా అమ్మాయి చెప్పిన సమాధానం..ఎలా ఉందంటే..

పాకిస్థాన్ రావల్పిండి ప్రాంతానికి చెందిన ఆసియా అనే యువతి వయస్సు 18 ఏళ్లు. అయితే, అదే ప్రాంతానికి చెందిన రాణా శంషాద్ అనే 62 ఏళ్ల వయసున్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గతంలో రాణా..దుప్పట్లకు రంగులు వేసేవారని, నాకు దుపట్టా అంటే చాలా ఇష్టమని చెప్పింది.ఈ క్రమంలోనే వాటికి రంగు వేయించడానికి తాను వారి దుకాణానికి వెళ్లినట్టుగా చెప్పింది. ఈ క్రమంలోనే అతనిపై ప్రేమకలిగినట్టుగా చెప్పింది. తర్వాత తనకు దుపట్టా బహుమతిగా ఇచ్చారని, క్రమంగా వారిద్దరూ ప్రేమలో పడ్డామని చెప్పింది. అప్పటికీ ఆ వృద్ధుడు తన వయస్సు 62 సంవత్సరాలు.. ఇంకా వివాహం చేసుకోలేదని చెప్పాడు. ఇప్పుడు నా జీవితంలోకి వచ్చి నా ఆసియా తన ఇంటిని, జీవితాన్ని సందడిగా మార్చేసిందంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ విషయం తెలిసి స్థానిక మీడియా ఇంటర్య్వూ చేయగా ఆసియా మాట్లాడుతూ… రాణా చాలా మంచివాడని, ఇతరులకు సహాయం చేస్తుంటాడని, అతడి మంచి పనులను చూసి అతడంటే ఇష్టం పెరిగిందని, ఆ తర్వాత అతడిని ప్రేమించానని చెప్పింది. ప్రస్తుతం రాణా తనని హ్యాపీగా చూసుకుంటున్నాడని, తామిద్దరం ఫుల్ హ్యాపీగా ఉన్నామంటూ పేర్కొంది. వీరి ఇంటర్ప్యూ వీడియోను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి