Viral Video: స్పైడర్ మ్యాన్ కూడా షాక్ అయ్యే సాహసం చేశాడుగా.. బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం ఇలా..
60ఏళ్ల వయసులో అతడు చేసిన గొప్ప సాహసం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కాదు, షాక్..అయ్యేలా చేస్తుంది. ఇంతకీ అతడు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
Viral Video: 60 ఏళ్లు వచ్చేశాయంటే… ఇక రిటైర్మెంట్ టైమ్ అయినట్టే.. బాధ్యతలన్నీ దాదాపు తీరిపోయాయని హాయిగా కృష్ణా రామా అంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు అనుకుంటారు చాలా మంది..కానీ,కొందరు మాత్రం ఇలాంటి వారందరికీ పూర్తి భిన్నంగా ఉంటారు..తమలోని టాలెంట్‌ని వయసుతో సంబంధం లేకుండా నిరూపిస్తూనే ఉంటారు..అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటాడు ఇక్కడ చెప్పబోయే ఈ వృద్ధుడు.. 60ఏళ్ల వయసులో అతడు చేసిన గొప్ప సాహసం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కాదు, షాక్..అయ్యేలా చేస్తుంది. ఇంతకీ అతడు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్ గా అందరూ పిలిచే అలైన్ రాబర్ట్ ఒక క్లైంబర్. ‘స్పైడర్‌మ్యాన్’గా పేరొందిన అలైన్ రాబర్ట్ శనివారం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని 48 అంతస్తుల భవనంపైకి ఎక్కాడు. ఈ సమయంలో పడిపోతే ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా కనీసం ఒక తాడు సాయం కూడా తీసుకోలేదు. ఎత్తయిన భవనాలను ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా ఎక్కేయడం అతని స్పెషాల్టీ. పారిస్‌లో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. అలైన్ రాబర్ట్ 60వ పుట్టిన రోజు సందర్భంగా ఇలాంటి సాహసం చేసి హల్‌చల్ చేశాడు. అయితే వీడియో వైరల్ కావడంతో వెంటనే స్థానిక పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
రాబర్ట్ ఇంతకుముందు చాలాసార్లు ఇలాంటి ఘనత సాధించాడు. ఈసారి అతను 48వ అంతస్తుకు చేరుకోవడానికి కేవలం 60 నిమిషాలు, అంటే 1 గంట సమయం పట్టింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ…నా పుట్టినరోజు జ్ఞాపకార్థం నేను ఎలాంటి సహాయం లేకుండా 48 అంతస్తుల భవనం ఎక్కాను. ఇది నాకు బెస్ట్ థ్రిల్ అంటున్నాడు.
గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ అధిరోహణ ఉద్దేశమంటున్నాడు. ఇతను తొలిసారిగా 1975లో పారిస్‌లోని 613 అడుగుల ఎత్తయిన భవనం టోటల్ ఎరన్జీస్‌ని పలుమార్లు ఇలాగే ఎక్కేసి అప్పట్లో వార్తల్లో నిలిచాడు.
మరిన్నీ ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి