Viral video: కంత్రీ కోతి.. ఎంత నైస్ గా దొంగతనం చేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ఆ వ్యక్తి కోతి వైపు వీపు పెట్టి కూర్చున్నాడు. వీపుకు బ్యాగ్‌ తగిలించుకుని ఉన్నాడు..పాపం అతనికి తెలియదు..అక్కడ దొంగ కోతులు ఉన్నాయని.. ఇంకేం..రెండు కోతులు వచ్చాయి.

Viral video: కంత్రీ కోతి.. ఎంత నైస్ గా దొంగతనం చేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Monkey
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 18, 2022 | 4:37 PM

Viral video: కోతులు.. ఈ భూమ్మీద అత్యంత తెలివైన జంతువులలో ఒకటి..అవి తరచుగా మనుషుల దగ్గరున్న ఆహారాన్ని దొంగిలించడానికి తెలివైన మార్గాలను ఎంచుకుంటాయి. కొన్ని కొన్ని సార్లు కోతులు జనాల వద్ద నుండి స్మార్ట్‌ఫోన్‌లు, సన్‌గ్లాసెస్, ఇతర వస్తువులను లాక్కోని పారిపోవడం వాటి కోసం ఆ వ్యక్తులు పడే పాట్లు సోషల్ మీడియాలో అనేకం చూస్తుంటాం..ఇక కోతులు తమకు కావాల్సిన దానికోసం పక్కాగా స్కేచ్‌ వేసుకుంటాయి..కరెక్ట్ టైమ్ చూసి గురిపెట్టిన వస్తువును చోరీ చేస్తుంటాయి.. ఆ చోరీ ఎప్పుడూ ఫెయిల్ కాదు. రెప్పపాటులో చోరీ జరిగిపోతుంది. అలా ఆ వానరం చేస్తున్న చోరీకి సంబంధించిన మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…

చాలా సార్లు కోతులు దేవాలయాలు, పార్కుల వద్ద పర్యాటకుల నుండి ఆహారాన్ని దొంగతనం చేయడం చూస్తుంటాం. ఇక్కడ వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. ఓ వ్యక్తి బ్యాక్‌ప్యాక్‌లో ఉన్న ఆహారాన్ని దొంగతనంగా తీసేసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి కోతి వైపు వీపు పెట్టి కూర్చున్నాడు. వీపుకు బ్యాగ్‌ తగిలించుకుని ఉన్నాడు..పాపం అతనికి తెలియదు..అక్కడ దొంగ కోతులు ఉన్నాయని.. ఇంకేం..రెండు కోతులు వచ్చాయి. అందులోని ఓ వానరం మెల్లిగా అతని బ్యాగ్‌ జిప్ తీయడం ప్రారంభించింది.  అందులో ఏం లేదు.. దాంతో ఇక మరో జిప్ తీసింది. అయినప్పటికీ అతను అలానే ఉన్నాడు. అందులో దానికి యాపిల్ దొరికింది. ఇంకేముంది పరుగో పరుగు తీసింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Waow Africa (@waowafrica)

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 103కే వ్యూస్ ఇప్పటికే వీడియోను 103కే చాలా సార్లు చూశారు. ఆ కోతి మాములు దొంగ కాదండూ నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి