AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: భార్యలు బతికుండగానే పిండ ప్రదానం.. ఎందుకు..? ఎక్కడ.. తెలిస్తే షాక్‌ అవుతారు..

వివాహానికి సంబంధించిన చెడు జ్ఞాపకాలను వదిలించుకోవడానికి వీరంతా పూర్తి ఆచార సాంప్రదాయాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరిలో కొందరు గుండు కూడా చేయించుకున్నారు.

Viral News: భార్యలు బతికుండగానే పిండ ప్రదానం.. ఎందుకు..? ఎక్కడ.. తెలిస్తే షాక్‌ అవుతారు..
Pind Daan
Jyothi Gadda
|

Updated on: Sep 18, 2022 | 8:30 PM

Share

Viral News: పితృ పక్షం సందర్భంగా ఆదివారం రోజున ముంబైలోని బంగంగా నది ఒడ్డున పలువురు తమ సజీవులైన భార్యలకు పిండప్రధానం చేశారు. చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయడం సాధారణం.. కానీ, ఇక్కడ బతికున్న వాళ్లకు పిండ ప్రదానం చేశారు. వీరంతా భార్య బాధితులు..వారు విడాకులు తీసుకున్నవారు లేదంటే, కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండటం కావొచ్చు.. ఈ రోజుల్లో పితృపక్షం, శ్రాద్ధ మాసం జరుగుతోంది. ఇక్కడ ప్రజలు చనిపోయిన వారి బంధువులకు పిండదానాన్ని అందిస్తారు. పూర్వీకులకు పిండప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ముంబైలో దాదాపు 50 మంది జీవించి ఉన్న తమ భార్యల పేరిట దానం చేసిన దృశ్యం కనిపించింది. వివాహానికి సంబంధించిన చెడు జ్ఞాపకాలను వదిలించుకోవడానికి వీరంతా పూర్తి ఆచార సాంప్రదాయాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరిలో కొందరు గుండు కూడా చేయించుకున్నారు. ఈ పిండ ప్రదాన కార్యక్రమం వాస్తవ్ పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఇలా బతికి ఉన్న భార్యలకు పిండం పెట్టడం వెనుక ఓ ఉద్దేశం ఉందట. పిండ ప్రదానం చేస్తే .. భార్యలు శాంతించి.. తమకు విముక్తి కల్పిస్తారని వారి ఆశని చెబుతున్నారు భార్యా బాధితులు. భార్యా బాధితుల కోసమే ఈ కార్యక్రమం చేపట్టామంటున్నారు ఫౌండేషన్ సభ్యులు అమిత్ దేశ్‌పాండే. పెళ్లిలో దంపతులు.. ఏడడుగులు వేసి కలిసి నడుస్తామని ప్రమాణం చేస్తారని.. కాని చాలా జంటలు పెళైన కొద్ది రోజులకే వివాదాలతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారన్నారు. విడాకుల కోసం కోర్టుల చుట్టు తిరిగినా.. మహిళలకు మద్దతు వస్తోందన్నారు. అందుకే భార్యా బాధిత భర్తలకు భరోసా కల్పించాలనే ఈ పిండ ప్రదానం చేస్తున్నామన్నారు. గతంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారణాసిలోనూ ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు పాండే. పిండ ప్రదానం చేయడం ద్వారా స్త్రీవాదమనే విషానికి కూడా తర్పణం వదులుతున్నామన్నారు. స్త్రీవాదానికి ముగింపు పలికి.. సమాజంలో సమానత్వం రావాలంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి