Viral Video: తొండమే కవచం.. బస్సు ప్రమాదం నుండి బిడ్డను రక్షించుకున్న తల్లి ఏనుగు.. ఏం చేసిందంటే..

ఆ విధంగా ఏనుగులు తన పిల్లకు రక్షణ కల్పిస్తూ కొండ రోడ్డుపై వస్తున్న బస్సుకు దారి ఇస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Viral Video: తొండమే కవచం.. బస్సు ప్రమాదం నుండి బిడ్డను రక్షించుకున్న తల్లి ఏనుగు.. ఏం చేసిందంటే..
Elephant
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 18, 2022 | 7:51 PM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించి వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. వాటిల్లో ఎక్కువగా ఏనుగులకు సంబంధించిన వీడియోలు మరింతగా ఆకర్షిస్తుంటాయి. ఏనుగులు మట్టికి నీళ్ళు పోయడం, స్నానం చేయడం, పర్వత సానువుల్లో జారడం మొదలుకుని అవి చేసే ప్రతి క్యూట్ యాక్టివిటీకి ఇంటర్నెట్‌లో హిట్స్, లైక్‌లు వస్తుంటాయి. ఆ విధంగా ఏనుగులు తన పిల్లకు రక్షణ కల్పిస్తూ కొండ రోడ్డుపై వస్తున్న బస్సుకు దారి ఇస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

దూరం నుంచి వస్తున్న బస్సును చూసిన ఈ ఏనుగులు పిల్ల ఏనుగును పక్కకు తీసుకెళ్ళి తమ మధ్య రక్షణ కవచంలా తమ తొండాలతో రక్షిస్తూ బస్సుకు దారిస్తున్నాయి. ఈ క్యూట్ వీడియోను సుధారామన్ తన ట్విట్టర్ పేజీలో షేర్‌ చేశారు. పెద్ద ఏనుగులు దారి ఇచ్చే సమయంలో పిల్ల ఏనుగును కవచంలా ఎలా కాపాడుకుంటాయో వీడియోలో చూడొచ్చు. అందుకే ఏనుగులను జెంటిల్‌ జెయింట్స్‌గా పిలుస్తున్నారు అని క్యూట్‌ క్యాప్షన్‌తో షేర్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ట్విటర్‌లో విపరీతమైన లైక్స్‌తో ట్రెండింగ్‌లో ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి