Unique Ritual: అక్కడ వింత సంప్రదాయం.. మానస దేవి ప్రసన్నం అవ్వాలంటే పాము కాటు పడాల్సిందే
పూజ సమయంలో అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన పాములు కూడా స్నేహితులవుతాయని నమ్ముతారు. ఈ సమయంలో భక్తులే కాకుండా విషసర్పాలు కూడా మానస దేవి భక్తిలో మునిగి నాట్యం చేస్తాయి
Manasa Devi Puja: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల ప్రజలు తమ ఆరాధ్య దేవతను ప్రసన్నం చేసుకోవడానికి వారి సొంత సంపద్రాయాలను పాటిస్తారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లో మానస దేవిని పూజించే సమయంలో భక్తులు తమ విశ్వాసాన్ని ప్రత్యేకమైన సంప్రదాయంతో వ్యక్తపరుస్తారు. మానస దేవి పూజ సమయంలో భక్తులు చాలా విషపూరితమైన పాములను పట్టుకుని నృత్యం చేస్తారు. వారితో రకరకాల విన్యాసాలు చేస్తారు. ఈ క్రమంలో పలుమార్లు విషసర్పం కూడా భక్తులను కాటేస్తుంది.
అవును జార్ఖండ్‌లోని గిరిజనులు తమ సాంప్రదాయ పండుగ మానసాదేవి పండగను జరుపుకుంటారు, ఈ సమయంలో భక్తులు హిందూ దేవత మానస దేవిని ప్రసన్నం చేసుకోవడానికి పాములు కాటువేయడం అనే ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తారు. మహూలియా సోల్ గ్రామంలో పాము కాటు వేసే సమయంలో భక్తులు తమ శరీరమంతా మూలికా ఔషధాలను పూసుకుంటారు. ముఖ్యంగా పాముల విషం నుండి తమని రక్షించే ఎక్లావి అనే ప్రత్యేకమైన మూలికా ఔషధాన్ని తీసుకుంటారు. దీంతో తమను ఎంత విషపూరితమైన పామును కరిచినా తమకు ఏమీ జరగదని భక్తులు విశ్వసిస్తారు.
నిజానికి, మా మానస దేవిని జార్ఖండ్‌లోని వివిధ జిల్లాల్లోని గిరిజన ప్రజలు పూజిస్తారు. రాష్ట్రంలోని సెరైకెలా ఖర్సావాన్ ప్రాంతంలోని బొందు తామడ్‌లో మానసాదేవి పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు.
झारखंड में अनोखी परंपर …… जहरीले सांपों से खुद को कटवाकर और उनके साथ नाचकर आस्था जताते हैं…. pic.twitter.com/06IhccgfiW
— Sweta Gupta (@swetaguptag) September 18, 2022
నమ్మకం ప్రకారం, మానస పూజ సమయంలో చుట్టూ ఉన్న అన్ని విషపూరిత పాములను మంత్రం సహాయంతో సేకరిస్తారు. మానస దేవి అందమైన విగ్రహాన్ని బెంగాల్ లేదా చుట్టుపక్కల కళాకారులు తయారు చేస్తారు. అదే సమయంలో మానస మా విగ్రహంలో ఒక పాముని కూడా ఏర్పాటు చేస్తారు.
విష సర్పాలతో నృత్యం:
పూజ సమయంలో అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన పాములు కూడా స్నేహితులవుతాయని నమ్ముతారు. ఈ సమయంలో భక్తులే కాకుండా విషసర్పాలు కూడా మానస దేవి భక్తిలో మునిగి నాట్యం చేస్తాయి. అదే సమయంలో ప్రజలు తమ మెడలో కొండచిలువ, నాగుపాము వంటి విష సర్పాలను ధరించి తిరుగుతారు. వారు వాటిని నోటితో నొక్కుతారు, తమని తాము కరిపించుకుంటారు. ఈ సమయంలో మనసాదేవి అనుగ్రహంతో పాములలోని విషం తమకి హాని చేయదని విశ్వాసం.
మానసాదేవి పై విశ్వాసం: పూజలు పూర్తయిన తర్వాత పట్టుకున్న విషసర్పాలను అడవుల్లో విడిచిపెడతారు. ప్రతి సంవత్సరం ఈ పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుందని.. తమ గ్రామస్థులను పాము కరవవని నమ్మకం. మానస పూజ సమయంలో వ్రతాలు చేసే భక్తుల కోరికలు ఎల్లప్పుడూ నెరవేరతాయని నమ్మకం. మానసాదేవి దేవాలయాల్లో తాంత్రిక సాధన, సవర మంత్రాలు ఆచరిస్తారు. ఒక నెల పాటు నిరంతరం పూజిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..