Mahakaleshwar Temple: మ్యాచ్‌కు ముందు మహాకాళేశ్వరుడిని దర్శించుకుని.. ఆశీర్వాదం తీసుకున్న భారత క్రికెట్ ఆటగాళ్లు

ముగ్గురు ఆటగాళ్లు ఆదివారం ఉజ్జయినికి చేరుకున్నారు.  బాబా మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకున్నారు.  దర్శనం బాగా జరిగిందని.. చెప్పారు. ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

Mahakaleshwar Temple: మ్యాచ్‌కు ముందు మహాకాళేశ్వరుడిని దర్శించుకుని.. ఆశీర్వాదం తీసుకున్న భారత క్రికెట్ ఆటగాళ్లు
Team India Players
Follow us
Surya Kala

|

Updated on: Sep 18, 2022 | 8:59 PM

Mahakaleshwar Temple: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని టీమిండియా సభ్యులు దర్శించుకుని పూజలను నిర్వహించారు. ఆదివారం రోజున టీమిండియా క్రికెటర్స్ సురేశ్ రైనా, ప్రజ్ఞాన్ ఓజా, మన్‌ప్రీత్ సింగ్ లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బాబా మహాకాళేశ్వర ఆలయానికి చేరుకున్నారు. మ్యాచ్‌కు ముందు గర్భాలయంలో శివయ్యకు ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సందర్భంగా మన క్రికెటర్స్ ఇండోర్ లో స్టే చేశారు.

క్రీడాకారులను ఉజ్జయిని అలోట్ పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీ అనిల్ ఫిరోజియా ఉజ్జయినికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సురేష్ రైనా, ప్రజ్ఞాన్ ఓజా సహా పలువురు ఎంపీ అనిల్ ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించారు. మహాకాళేశ్వరుడిని దర్శించడానికి వస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ముగ్గురు ఆటగాళ్లు ఆదివారం ఉజ్జయినికి చేరుకున్నారు.  బాబా మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకున్నారు.  దర్శనం బాగా జరిగిందని.. చెప్పారు. ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించిన క్రీడాకారులు  రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు రోడ్‌ సేఫ్టీ క్రికెట్‌ సిరీస్‌ ఆడతామని టీమ్‌ ఇండియా ఆటగాడు సురేశ్‌ రైనా తెలిపాడు. దేశంలోని ప్రతి వ్యక్తి అవగాహన కలిగి ఉండాలని,  రహదారిపై ప్రతి నియమాన్ని, చట్టాన్ని అనుసరించి నడుచుకోవాలని చెప్పారు. భారతీయులందరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. అందుకే చాలా ఏళ్లుగా ఈ సిరీస్ నిర్వహిస్తున్నారు. రోడ్‌ సేఫ్టీ క్రికెట్‌ సిరీస్‌లో క్రికెట్‌ నుంచి రిటైరైన వెటరన్‌ ఆటగాళ్లు కూడా క్రికెట్‌ ఆడేందుకు వస్తారని.. ఈ సిరీస్‌లో భారత జట్టుతో పాటు ఇతర దేశాలకు చెందిన వెటరన్‌ ఆటగాళ్లు కూడా టోర్నీలో పాల్గొంటారని సురేష్ రైనా తెలిపారు.

సచిన్ టెండూల్కర్‌కు కూడా ఆహ్వానం:

మహామృత్యుంజయ ద్వారం వద్ద క్రీడాకారులకు ఎంపీ అనిల్ పూల మాల వేసి ఘన స్వాగతం పలికారు. రేపటి మ్యాచ్‌కు ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాదు గణేష్ విగ్రహాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు సచిన్ టెండూల్కర్‌ను కూడా మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించినట్లు ఎంపీ అనిల్ ఫిరోజియా తెలిపారు.  తన ఆహ్వానాన్ని సచిన్ అంగీకరించారని త్వరలో రావచ్చు అని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..